NTV Telugu Site icon

ఎమ్మెల్యే గండ్ర సవాల్‌కు మధు యాష్కీ కౌంటర్‌

హుజురాబాద్‌ ఉప ఎన్నికలు సమయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య సవాళ్ల పర్వం కొనసాగుతోంది… గతంలో హుజురాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీకి 60 వేల ఓట్లు వచ్చాయని.. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌కు ఒక్క ఓటు పెరిగినా.. నేను, నా భార్య మా పదవులకు రాజీనామా చేస్తామని.. దీనికి నువ్వు సిద్ధమా? అంటూ పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డికి బహిరంగ సవాల్‌ విసిరారు టీఆర్ఎస్‌ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి.. అయితే, గండ్ర వ్యాఖ్యలపై సీరియస్‌గా రియాక్ట్‌ అయ్యారు కాంగ్రెస్‌ నేత మధుయాష్కీ గౌడ్.. నైతిక విలువలు లేని వ్యక్తి గండ్ర అంటూ ఫైర్ అయిన ఆయన.. గండ్రకు సిగ్గు శరం లేదని మండిపడ్డారు.. తల్లి లాంటి కాంగ్రెస్‌ పార్టీని మోసం చేసి టీఆర్ఎస్‌లో చేరావు.. ముందు రాజీనామా చేయి అంటూ గండ్రకు సవాల్‌ విసిరారు మధు యాష్కీ.. నీ ఎదుగుదలకు కారణం కాంగ్రెస్.. పదవుల కోసం పార్టీ మారావు.. నీకు దమ్ముంటే.. రాజీనామా చేసి భూపాలపల్లిలో పోటీ చేసి గెలవాలంటూ సవాల్‌ చేశారు మధుయాష్కీ గౌడ్.