Shocking: హైదరాబాద్‌లో మరో దారుణం వెలుగులోకి వచ్చింది. మాదన్నపేట ప్రాంతంలో ఏడు సంవత్సరాల బాలికను కిరాతకంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన పోలీసులు నిందితులైన మేనమామ, అత్తను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం, బాలిక తల్లితో నిందితుల మధ్య కొంతకాలంగా ఆస్తి పంపకాలపై విభేదాలు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో బాలిక తరచూ అల్లరి చేస్తుందని కోపంతో, ఆ చిన్నారి ప్రాణాన్ని తీయడానికి నిందితులు భయంకరమైన పథకం రచించారు.
Trump: హమాస్‌కు ట్రంప్ కొత్త డెడ్‌లైన్.. లేదంటే ఆదివారం నరకం చూస్తారని హెచ్చరిక
ఆ క్రమంలో బాలికను ఇంట్లోనే అదుపులోకి తీసుకుని, చేతులు కాళ్లు కట్టేసి, నోటికి ప్లాస్టర్ వేసి ఊపిరాడకుండా చేశారు. అనంతరం ఆ చిన్నారిని వాటర్ ట్యాంక్‌లో పడేశారు. బాలిక కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించగా, విచారణలో ఈ భయంకరమైన నిజం వెలుగులోకి వచ్చింది.
హత్య వెనుక ఉన్న ఆస్తి తగాదాలు, కోపం, చిన్నారి నిర్లక్ష్యంగా అల్లరి చేస్తుందన్న కారణాలతో ఈ నేరానికి పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇలాంటి మానవత్వరహిత చర్యలకు పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
