Lotus Pond Land Auction: లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత! అమ్మకానికి వేల కోట్ల భూమి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lotus Pond Land Auction: హైదరాబాద్‌లోని అత్యంత ఖరీదైన ఏరియా జూబ్లీహిల్స్ లోటస్ పాండ్ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. వేల కోట్ల రూపాయల విలువ చేసే పార్క్ స్థలాన్ని ప్రభుత్వం వేలానికి పెట్టడమే కాకుండా, భారీ పోలీసు బందోబస్తు మధ్య పనులు మొదలుపెట్టడంతో స్థానికులు భగ్గుమన్నారు. పార్క్‌లో ఉన్న విలువైన చెట్లను నరికేసి, జేసీబీలతో స్థలాన్ని చదును చేస్తుండటంతో కాలనీవాసులు అక్కడికి చేరుకుని పనులను అడ్డుకున్నారు. అధికారుల తీరుకు నిరసనగా ఆందోళనకు దిగడంతో అక్కడ హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది.
ఈ వివాదంపై స్థానికులతో కలిసి పోరాడుతున్న మాజీ ఐపీఎస్ అధికారి యోగానంద్, ప్రభుత్వం తీరుపై సంచలన విషయాలు బయటపెట్టారు. ఈ నెల 24న ప్రధాన దినపత్రికల ఫ్రంట్ పేజీలో ప్రభుత్వం ఒక ప్రకటన ఇచ్చిందని, అందులో లోటస్ పాండ్ వద్ద ఉన్న సుమారు 10,150 గజాల స్థలాన్ని వేలం వేస్తున్నట్లు పేర్కొందని తెలిపారు. నిజానికి గతంలోనూ ప్రభుత్వం ఈ భూమిని అమ్మేందుకు ప్రయత్నించగా, తాము కోర్టును ఆశ్రయించామని ఆయన గుర్తు చేశారు. అప్పట్లో ఈ స్థలాన్ని కేవలం పార్క్‌గా మాత్రమే అభివృద్ధి చేస్తామని న్యాయస్థానానికి ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇచ్చిందని యోగానంద్ చెప్పారు.
Also Read
- Nagarjuna: డ్రగ్స్ రహిత భారత్ కోసం అందరూ ముందుకు రావాలి.. హీరో నాగార్జున పిలుపు
- Karimnagar: ఒకే పెళ్లికి రెండుసార్లు రిజిస్ట్రేషన్.. కరీంనగర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఏం జరుగుతోంది?
- TG Climate Conclave 2026: ఎల్‌నినో ప్రభావంపై ముందస్తు ప్రణాళిక.. డిసెంబర్ 8న సీఎం రేవంత్ రెడ్డి కీలక రోడ్‌మ్యాప్..
- Hyderabad: హైదరాబాద్ చేపల మార్కెట్లపై టీజీ ఫుడ్ సేఫ్టీ ఆకస్మిక దాడులు.. 200 కిలోల కుళ్లిన చేపలు సీజ్!
కోర్టుకు ఇచ్చిన మాటను పక్కనపెట్టి ఇప్పుడు మళ్లీ వేలానికి సిద్ధమవడమే కాకుండా, ప్రకటనలో తప్పుడు వివరాలు ఇచ్చారని యోగానంద్ మండిపడ్డారు. ఈ స్థలానికి 40 గజాల రోడ్డు ఉందని ప్రకటనలో చూపించారని.. కానీ అక్కడ అసలు రోడ్డే లేదని, ఇప్పుడు స్థలాన్ని చదును చేసి కొత్తగా రోడ్డు వేస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా, అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉందని ప్రకటనలో రాశారని, కానీ వాస్తవానికి లోటస్ పాండ్ నుంచి వచ్చే అదనపు నీరు నేరుగా ఈ స్థలంలోకే వచ్చి నిలుస్తోందని అక్కడి పరిస్థితిని కళ్లకు కట్టారు. వేల కోట్ల విలువ చేసే పార్క్ భూమిని కమర్షియల్‌గా మార్చి అమ్మేసే ప్రయత్నాలను ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకుంటామని స్థానికులు తేల్చి చెబుతున్నారు. పోలీసుల పహారా మధ్య సాగుతున్న ఈ పనులపై ప్రభుత్వం వెనక్కి తగ్గుతుందా లేక వివాదం మరింత ముదురుతుందా అనేది చూడాలి.
తాజావార్తలు
-
Lotus Pond Land Auction: లోటస్ పాండ్ వద్ద ఉద్రిక్తత! అమ్మకానికి వేల కోట్ల భూమి..
-
Modi Delimitation Formula: డీలిమిటేషన్ బిల్లులపై మారుతున్న సమీకరణాలు.. మోడీ మాస్టర్ ప్లాన్..! దక్షిణాది పార్టీల వైఖరిలో మార్పు!
-
Rustum: తనతో తానే భీకర యుద్ధం.. ‘అపరాధ భావమే’ అతిపెద్ద శత్రువు
-
Sandeep Reddy Vanga: సందీప్ రెడ్డి వంగా నెక్స్ట్ సినిమా ఫిక్స్.. హీరో ఎవరంటే?
-
CBN Flight Technical Issue: చంద్రబాబు ప్రత్యేక విమానంలో సాంకేతిక సమస్య.. హెలికాప్టర్లో హైదరాబాద్‌కు..!
ట్రెండింగ్
-
Shani Margi 2026: ఈ 3 రాశుల వారికి ఇక తిరుగులేని అదృష్టం.. ఆర్థికంగా పట్టిందల్లా బంగారమే!!
-
Mohammed Siraj: మహమ్మద్ సిరాజ్‌కు మరోసారి షాక్.. ఆరేళ్ల అరుదైన రికార్డుకు బ్రేక్.. అయ్యో పాపం డీఎస్పీ!
-
రగ్గడ్ లుక్, 258 PS పవర్‌తో రాబోతున్న Nissan Terrano SUV..!
-
బ్యాటరీ స్వాపింగ్ టెక్నాలజీతో హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ Ioniq M SUV ఆవిష్కరణ..!
-
999cc ఇంజిన్, 218hp పవర్.. BMW M 1000 RR సూపర్‌బైక్ భారత్ లో లాంచ్.!