NTV Telugu Site icon

CM KCR: నేడు మహారాష్ట్రకు సీఎం కేసీఆర్‌.. షెడ్యూల్‌ ఇదే..

Cm Kcr

Cm Kcr

CM KCR: బీఆర్‌ఎస్ పార్టీ నేడు మహారాష్ట్రలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. లోహా నియోజకవర్గంలోని నాందేడ్‌లో నిర్వహించే ఈ సభకు ఎక్కువ మంది హాజరయ్యేలా పార్టీ శ్రేణులు సన్నాహాలు చేశారు. ఈ బహిరంగ సభకు పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అయితే మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ సమావేశం జరగడం ఇది రెండోసారి. అక్కడ పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా.. సీఎం కేసీఆర్ అడుగులు వేస్తున్నారు. బీఆర్‌ఎస్‌ను దేశవ్యాప్తంగా, అన్ని రాష్ట్రాల్లో విస్తరించేందుకు ప్రణాళిక రూపొందించిన సీఎం కేసీఆర్.. ఇప్పటికే అన్ని రాష్ర్టాల నేతలతో సంప్రదింపులు జరిపారు. ఈ క్రమంలో మహారాష్ట్రలోని బీజేపీ, ఎన్సీపీ, కాంగ్రెస్ తదితర పార్టీల నేతలతో పాటు ఛత్రపతి శివాజీ వారసులైన నేతలు కూడా ముందుకు వచ్చారు. తెలంగాణకు ఆనుకుని ఉన్న మహారాష్ట్ర గ్రామాల ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వాటన్నిటిని పరిగణలోకి తీసుకున్న సీఎం కేసీఆర్ మొదట మహారాష్ట్రలో తమ పార్టీ కార్యక్రమాల విస్తరణ వైపుగా అడుగులు వేస్తున్నారు.

Read also: Shikhar Dhawan : ప్రేమించండి.. కానీ పెళ్లి మాత్రం చేసుకోకండి..

షెడ్యూల్‌..

ఈనేపథ్యంలో.. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్ లో మహారాష్ట్రలోని లోహాకు వెళ్తారు. సాయంత్రం 3 గంటలకు స్థానిక నేతలతో సమావేశమై 4 గంటలకు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. కాగా..ఈ భారీ బహిరంగసభలో పరువురు మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ పార్టీల నేతలు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరనున్నారు. అనంతరం సీఎం కేసీఆర్ దేనిపై చర్చించనున్నారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడం, విచారణకు పిలవడం వంటి వాటిపై స్పందించే అవకాశం ఉందా? లేదో? మరి చూడాలి. అయితే సీఎం కేసీఆర్ దేనిపై సభలో ఏం మాట్లాడనున్నారో అందరిలో ఆశక్తి నెలకొంది.

Read also: Cashew Rs.30 Per KG: జీడిపప్పు కిలో 30 రూపాయలు మాత్రమే..!

నాందేడ్ లో మొదటి సభ..

అయితే.. నాందేడ్ జిల్లాలో ఫిబ్రవరి 5వ తేదీన మొదటి సారి భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈసభకు వేలాది మంది తరలిరావడం, భారీ స్థాయితో సభ సక్సెస్ కావడంతో మహారాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద తమ పార్టీ పేరును నమోదు చేయించారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎక్కువగా ఉన్న నాందేడ్ తో పాటు ఠాణె, అహ్మద్ నగర్, శిర్డీ, బ్రుహన్ ముంబై లాంటి కార్పొరేషన్లలో పోటీకీ సన్నద్ధం అవుతోంది. ఈనేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఈసభను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఇటీవలే హైదరాబాద్ లో తన అనుచరులతో సీఎం కేసీఆర్ ను కలిసి తమ వద్ద సభ నిర్వహించాలని లోహా మాజీ ఎమ్మెల్యే, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ నేత శంకర్ గణేశ్ రావు ధోంగె కోరారు. ఈనేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ నేతరు 10 రోజులుగా అక్కడే ఉండి ఇవాళ జరిగే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు.
Telugudesam Party:ఈనెల 28న టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ

Show comments