బీఆర్‌ఎస్ పార్టీ నేడు మహారాష్ట్రలో భారీ బహిరంగ సభ నిర్వహించనుంది. లోహా నియోజకవర్గంలోని నాందేడ్‌లో నిర్వహించే ఈ సభకు ఎక్కువ మంది హాజరయ్యేలా పార్టీ శ్రేణులు సన్నాహాలు చేశారు. ఈ బహిరంగ సభకు పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.