Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Live Telangana Budget 2022 23

LIVE: తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్ రావు

Published Date :March 7, 2022 , 11:36 am
By NTV WebDesk
LIVE: తెలంగాణ బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్ రావు
  • Follow Us :
  • google news
  • dailyhunt

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. రాజ్యాంగాన్ని కాపాడండి అంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే లు , సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సభలోకి ప్రవేశించారు. రాజ్యాంగము బుక్ తో సభ లోకి భట్టి విక్రమార్క ప్రవేశించారు. బడ్జెట్ ప్రవేశ పెడుతున్నారు ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు.

Also Read

  • Kavitha New Party: కవిత కొత్త పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం..
  • Software Engineer Suicide: మా కోడలికి ఆరుగురు బాయ్ ఫ్రెండ్స్.. ప్రవర్తన నచ్చకే కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు.. తండ్రి ఆవేదన.!
  • Extramarital affair: ప్రియురాలి ఇంట్లోకి దూరిన ప్రియుడు.. సడన్ గా ఎంట్రీ ఇచ్చిన భర్త..
  • Software Engineer: సాఫ్ట్‌వేర్ సీతారాం సూ*సైడ్ కేస్.. భార్య రేణుక తో పాటు ఆమె ఇద్దరు లవర్స్ అరెస్ట్

ఈసారి రాష్ట్ర బడ్జెట్‌ రూ.2.56 లక్షల కోట్లు. సీఎం రాష్ట్రాన్ని ప్రగతిపథంలో తీసుకెళ్తున్నారు. రాష్ట్రం ఆవిర్భవించిన అనతికాలంలో అద్భుత ప్రగతి సాధిస్తోంది. తెలంగాణ ప్రగతి మన కళ్ల ముందు జరుగుతున్న చరిత్ర. ప్రజల అభివృద్ధే ధ్యేయంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. దేశానికే ఆదర్శంగా తెలంగాణ ప్రగతి సాధిస్తోంది. అవినీతిరహితంగా పథకాలు అమలు చేస్తున్నాం. రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు కేంద్రం ఇవ్వడం లేదు.

సవాళ్ళు క్లిష్టమయిన పరిస్థితులను అధిగమిస్తున్నాం. కరెంట్ కోతల నుంచి విముక్తి కల్పించిన రాష్ట్రం తెలంగాణ.తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తోంది. ఇది పేదల బడ్జెట్. క్యాపిటల్ వ్యయం 29,728.44 కోట్లు. రెవిన్యూ వ్యయం 1,89,274.82 కోట్లు. జహీరాబాద్ నిమ్స్ కు కేంద్రం రూ.500 కోట్లు ఇవ్వలేదు. ఆర్థిక సంఘం సూచనలను కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు హరీష్ రావు.

దళితబంధుకు రూ.17,700 కోట్లు. పల్లె ప్రగతి ప్రణాళికకు రూ.330 కోట్లు. పట్టణ ప్రగతి ప్రణాళికకు రూ.1,394 కోట్లు. అటవీ విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు కేటాయించారు. అతి తక్కువ కాలంలో వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రం తెలంగాణ. పేదలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం ముందుకెళుతుందని సీఎం కేసీఆర్ భావించారు. అందుకే ప్రతి పథకం వారికి అందేలా చర్యలు చేపడుతున్నాం. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటినుంచీ పేదల కోసం పథకాలు అవలంభిస్తున్నాం. దళిత జాతి అభ్యున్నతికి దళిత బంధు పథకం ఒక దిక్సూచీ. దళిత జాతి ఆర్థిక ప్రగతికి ఇది సాధనం కానుంది. ప్రతి దళిత కుటుంబానికి ఉపాధికోసం 10 లక్షలు అందిస్తాం.

ఎస్టీ సంక్షేమం 12 వేల 565 కోట్లు, బీసీ సంక్షేమం 5 వేల 698 కోట్లు, బ్రాహ్మణ సంక్షేమం కోసం 177 కోట్లు, కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ లకు 2 వేల 750 కోట్లు, ఆసరా పింఛన్లకు 11 వేల 728 కోట్లు, డబల్ బెడ్రూం ఇళ్లకు 12 వేల కోట్లు కేటాయింపు.

శాసనసభ నుంచి బీజేపీ సభ్యుల సస్పెన్షన్‌. ఈటల, రఘునందన్‌, రాజాసింగ్‌ సస్పెన్షన్‌. బడ్జెట్ సెషన్ ముగిసేవరకూ సస్పెన్షన్.

మన ఊరు మన బడికి రూ7289 కోట్లు. గురుకుల విద్యకు భారీగా నిధులు. దేశంలో ఎక్కువ గురుకులాలు వున్న రాష్ట్రం తెలంగాణ. అన్ని పాఠశాలల్లో ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యాబోధన. రూ.75 వేల లోపు పంట రుణాల మాఫీ.

సొంత స్థలంలో డ‌బుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం. సొంత స్థలాల్లో ఇండ్ల నిర్మాణానికి రూ. 3 ల‌క్షల ఆర్థిక సాయం. సొంత‌స్థలం ఉన్న 4 ల‌క్షల మందికి రూ. 3 ల‌క్షల ఆర్థిక సాయం.
నియోజ‌క‌వ‌ర్గానికి 3 వేల ఇండ్లు కేటాయింపు. ఎమ్మెల్యేల ప‌రిధిలో 3.57 ల‌క్ష‌ల ఇండ్లు కేటాయింపు. నిర్వాసితులు, ప్రమాద బాధితుల‌కు 43 వేల ఇండ్లు కేటాయింపు. సీఎం ప‌రిధిలో నిర్వాసితులు, ప్రమాద‌బాధితుల‌కు ఇండ్ల కేటాయింపు.

వ్యవ‌సాయ రంగానికి రూ. 24,254 కోట్లు
పామాయిల్ సాగుకు రూ. 1000 కోట్లు
రాష్ట్రంలో 2.5 ల‌క్ష‌ల ఎక‌రాల్లో ఆయిల్ పామ్ సాగు ల‌క్ష్యం.
హ‌రిత‌హారానికి రూ. 932 కోట్లు

ద‌ళిత‌బంధుకు రూ. 17,700 కోట్లు
కొత్త వైద్య కాలేజీల‌కు రూ. 1000 కోట్లు
పల్లె ప్రగతి ప్రణాళికకు రూ.330 కోట్లు
పట్టణ ప్రగతి ప్రణాళికకు రూ.1,394 కోట్లు
అటవీ విశ్వవిద్యాలయానికి రూ.100 కోట్లు
మెదక్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, ములుగులో వైద్య కళాశాలలు
నారాయణపేట, గద్వాల, యాదాద్రిలో వైద్య కళాశాలలు

వ్యవసాయరంగానికి 5 గంటల విద్యుత్ ఇవ్వమని అడిగితే సమైక్య రాష్ట్రం పట్టించుకోలేదు. తెలంగాణ ఏర్పడ్డాక ప్రభుత్వం వ్యవసాయరంగాన్ని బలోపేతం చేసింది. రాష్ట్రంలో ఊహకందని రీతిలో పంటల దిగుబడి వచ్చింది. తెలంగాణ పత్తికి అంతర్జాతీయ రంగంలో డిమాండ్ వుంది.

దేశంలో పామాయిల్ సాగుకి తెలంగాణ అనుకూలం అయింది. రాష్ట్రంలో విరివిగా పామాయిల్ సాగుకి ప్రాధాన్యత ఇచ్చింది. పామాయిల్ సాగుని ప్రోత్సహిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. రైతుల సమావేశాల కోసం రైతు వేదికలు ఏర్పాటుచేస్తోంది. ఇలాంటి సదుపాయం ఎవరూ కల్పించలేదు. వ్యవసాయచట్టాలపై రైతులు డిమాండ్ చేశారు. లక్షలాదిమంది రైతులు ఏడాదిన్నరపాటు ఆందోళన చేశారు. రైతులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఎరువుల సబ్సిడీపై కోత విధించింది. ఎరువుల ధరలు పెరిగితే రైతులు మరింత ఇబ్బంది పడుతున్నారు. రైతుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజీ పడడం లేదు. పనుల కోసం ఇతర ప్రాంతాల వారు తెలంగాణకు వస్తున్నారు. వ్యవసాయం అనుబంధ రంగాలు ముందుకెళుతున్నాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయింది. గ్రామీణ జీవితం ఎంతో మారిపోయింది.

2022..23 లో ప్రభుత్వ ఆదాయం అంచనా
స్టాంప్డ్, రిజిస్ట్రేషన్స్ ద్వారా 15 వేల 600 కోట్లు
సేల్స్ టాక్స్ ద్వారా 33 వేల కోట్లు
ఎక్సైజ్‌ ద్వారా 17 వేల 500 కోట్లు
వెహికిల్స్ పై టాక్స్ ద్వారా 4 వేల 953 కోట్లు
కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా కింద 18 వేల 394 కోట్లు
గ్రాంట్స్ ఇన్ ఎయిడ్స్ 41 వేల ఒక కోటి

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమానికి కొత్త పథకం
మొదటి విడతలో లక్ష మంది కార్మికులకు మోటారు సైకిళ్లు
దూపదీప నైవేద్య పథకంలోకి కొత్తగా 1,736 ఆలయాలు
దూపదీప నైవేద్య పథకానికి రూ.12.50 కోట్లు
రూ.1,547 కోట్ల వ్యయంతో వైకుంఠధామాల నిర్మాణం
ప్రతినెలా గ్రామ పంచాయతీల నిర్వహణ కోసం రూ.227.5 కోట్లు విడుదల
పురపాలక, నగరపాలికల్లో పచ్చదనానికి 10 శాతం గ్రీన్‌ బడ్జెట్‌ కేటాయింపు
మరణించిన నేతన్న కుటుంబానికి రూ.5 లక్షల బీమా
గీత కార్మికుల సంక్షేమం కోసం రూ.100 కోట్లతో పథకం
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాల విద్యార్థినులకు హెల్త్‌, హైజీనిక్‌ కిట్స్‌ పథకం
ఏడు నుంచి 12వ తరగతి విద్యార్థినులకు హెల్త్‌, హైజీనిక్‌ కిట్స్‌
2021-22 నాటికి రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.11,54,860 కోట్లు
2021-22లో జీఎస్‌డీపీ వృద్ధి రేటు 11.2 శాతంగా అంచనా
2021-22లో దేశ జీడీపీ 8.9 శాతంగా అంచనా
ప్రస్తుత ధరల వద్ద జీఎస్‌డీపీ వృద్ధి రేటు 11.1 శాతంగా అంచనా
రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధిరేటు 11.1 శాతంగా అంచనా
దేశ జీడీపీ వృద్ధి రేటు 19.14 శాతంగా అంచనా
దేశ జీడీపీలో 4.97 శాతానికి పెరిగిన తెలంగాణ వాటా

అప్పుల ద్వారా 53 వేల 970 కోట్లు

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • 2022-23 budget
  • assembly
  • Budget session
  • cm kcr
  • Governor

తాజావార్తలు

  • IPL 2026: “ఇక 350 కొడితేనే సేఫ్”.. ఐపీఎల్ పరుగుల ప్రవాహంపై ఆ దేశ క్రికెట్ బోర్డు ఆసక్తికర పోస్ట్..

  • Bengal Exit Poll: అంతుచిక్కని బెంగాల్ ఓటర్ నాడి.. ఎగ్జిట్ పోల్స్‌పై ప్రముఖ సంస్థ మౌనం..

  • UGC Net: యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల.. ముఖ్యమైన తేదీలు ఇవే..

  • Pakistan: ట్రంప్‌ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..

  • OTT Movies : థియేటర్స్‌లో చిన్న చిత్రాలు.. దెబ్బ కొడుతున్న ఓటీటీ సినిమాలు

ట్రెండింగ్‌

  • 3.4K డిస్‌ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!

  • స్టైలిష్ కలర్స్‌తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?

  • స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!

  • Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!

  • Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్‌ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions