బంజారాహిల్స్ లో టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి సంచలనంగా మారింది. రాడిసన్ బ్లూ హోటల్ లోని పుడింగ్ మిగ్ పబ్ లో తెల్లవారే వరకు నిర్వహిస్తూ యాజమాన్యం హంగామా సృష్టిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ దాడుల్లో రాహుల్ సింప్లిగంజ్, ఉప్పల్ అనిల్ కుమార్, నిహారిక, సిరీస్ రాజు కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. ర్యాడిసన్ బ్లూ హోటల్ లోని పబ్ ని అధికారులు సీజ్ చేశారు. గతంలో కూడా రాహుల్ పై ఓ పబ్ లో దాడి జరిగిన విషయం తెలిసిందే. మరోమారు పబ్ సంఘటనలోనే రాహుల్ దొరికిపోవడం సంచలనంగా మారింది. 150 మందికి పైగా ఈ కేసులో వున్నట్టు తెలుస్తోంది. రాహుల్ సిప్లిగంజ్ కి కౌన్సిలింగ్ ఇచ్చారు పోలీసులు.
