Site icon NTV Telugu

LIVE: గాంధీభవన్ దగ్గర ఉద్రిక్తత

హైదరాబాద్‌ గాంధీ భవన్ వద్ద హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. తెలంగాణ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన వివిధ ఉద్యోగాలకు సంబంధించి వెంటనే నోటిఫికేషన్లు విడుదలచేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్ యూ ఐ ఆందోళనలకు దిగింది. ఈ డిమాండ్ తోనే టీఎస్‌పీఎస్సీ ముందు ఆందోళనకు దిగారు ఎన్‌ ఎస్ యుఐ కార్యకర్తలు. దీంతో భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎన్‌ ఎస్ యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్, కార్యకర్తల్ని అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

దీంతో ఆందోళనకారులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తోపులాట జరిగింది. గాంధీ భవన్ నుంచి కమిషన్ కార్యాలయం వైపు దూసుకుపోయే ప్రయత్నం చేశారు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు. దీంతో వారిని అడ్డుకున్నారు పోలీసులు. ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చేవరకూ తమ ఆందోళనలు కొనసాగుతాయని ఆందోళనకారులు స్పష్టం చేశారు.గాంధీభవన్ ఆందోళన నేపథ్యంలో సీపీ సీవి ఆనంద్ కి సిఎల్పీ నేత భట్టి ఫోన్ చేశారు. అరెస్ట్ చేసిన ఎన్‌ ఎస్ యుఐ నాయకులను విడుదల చేయాలని కోరారు భట్టి విక్రమార్క. గాంధీ భవన్ కి పోలీసులు తాళాలు వేయడం ఏంటి..? అని సీపీని ప్రశ్నించారు భట్టి.

Exit mobile version