Site icon NTV Telugu

LIVE: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రెస్ మీట్

ధాన్యం కొనకుంటే అధికారం నుంచి కేసీఆర్ తప్పుకోవాలి. నీచ, నికృష్టమైన, మతి తప్పిన కేసీఆర్ ఆలోచనలతో రైతులు మునిగిపోయారు. ముఖ్యమంత్రి, ఆరోగ్య మంత్రి తప్పులు చేస్తే‌.‌. శిక్ష ఎంజీఎం సూపరింటెండెంట్ అనుభవించాలా? చేతకాక,చేవలేక ముఖ్యమంత్రి చిల్లర పనులు చేస్తున్నాడు.

పెంచిన విద్యుత్, బస్ చార్జీలు నుంచి ప్రజలు తప్పుదోవ పట్టించే ప్రయత్నం సీఎం చేస్తున్నాడు. లక్షలాది మంది రైతులు, పౌల్ట్రీ రంగం ఉసురు కేసీఆర్ పోసుకుంటున్నారన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల.

తన కాళ్ళ కింద భూమి కదిలిపోతుందని సీఎం కేసీఆర్ భయపడుతున్నారని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ధాన్యం సేకరణ విషయంలో తెలంగాణ రాజకీయం చేస్తోందన్నారు. కోపం వుంటే బీజేపీపై తీర్చుకోవాలని, రైతులపై కక్ష సాధింపు వద్దన్నారు రాజేందర్. ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే కొనకుండా రైతుల్ని వేధించడం సరైంది కాదన్నారు. కరువు వస్తే పంటలు పండకపోతే ఒకే… కానీ అన్నీ వుండి కూడా పంటలు పండించవద్దనడం మూర్ఖత్వమే అన్నారు. 10వేల కోట్లు పెట్టి పంట కొనుగోలు చేయాలన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనాలన్నారు. కేంద్రం చెబితే అన్నీ చేస్తున్నారా? అని ప్రశ్నించారు. రైతుల కళ్ళల్లో మట్టికొట్టావు. వారికి అన్యాయం చేయవద్దన్నారు. వెంటనే ధాన్యం కొనుగోళ్ళు చేయాలి. లేదంటే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.

Exit mobile version