Wines Tender : రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల లైసెన్స్ దరఖాస్తులకు ఊహించని స్థాయిలో స్పందన లభిస్తోంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో దరఖాస్తులు సమర్పించబడుతున్నాయి. ముఖ్యంగా మహిళా అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరగడంతో ఎక్సైజ్ కార్యాలయాలు రద్దీగా మారాయి. ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయ సమాచారం ప్రకారం ఇప్పటివరకు 50 వేల దరఖాస్తులు స్వీకరించబడ్డాయి. ఈరోజు మరో 50 వేల దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఒక్కో దరఖాస్తు ఫీజు రూ.3 లక్షలు కావడంతో దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి ఇప్పటికే వేల కోట్ల రూపాయల ఆదాయం చేరింది.
Tirupathi : తిరుపతిలో మత్తు ఇంజక్షన్లు కలకలం..మత్తులో ములిగిపోయిన యువత
ఈసారి రాష్ట్రంలో మొత్తం 2,620 మద్యం షాపులకు లైసెన్సులు ఇవ్వనున్నారు. అందుకోసం దరఖాస్తుల స్వీకరణ వేగంగా కొనసాగుతోంది. గౌడ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించినట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. అయితే సొండి సామాజిక వర్గానికి కూడా రిజర్వేషన్ ఇవ్వాలని కొందరు సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణతో పాటు యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు వచ్చి దరఖాస్తులు సమర్పించారు. ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళ 150 మద్యం దుకాణాల కోసం దరఖాస్తు చేసినట్లు సమాచారం. రాష్ట్ర సరిహద్దుల్లోని జిల్లాల్లో వీరి ఆసక్తి ఎక్కువగా ఉంది.
దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యాక ఈనెల 23న మద్యం దుకాణాల లైసెన్స్‌ల కోసం డ్రా నిర్వహించనుంది. పారదర్శకత కోసం ఆన్‌లైన్ డ్రా పద్ధతిలో ఎంపిక చేయనున్నట్లు ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. ఈసారి లైసెన్స్ దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.3 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది.
ఈ మొత్తంలో భాగం రాష్ట్ర ఆదాయానికి గణనీయమైన తోడ్పాటు ఇవ్వనుంది. మద్యం దుకాణాల లైసెన్స్‌లపై ప్రజల్లో ఆసక్తి పెరగడంతో, ఎక్సైజ్ శాఖ కార్యాలయాల వద్ద వాతావరణం పండుగలా మారింది. ముఖ్యంగా మహిళా దరఖాస్తుదారుల ఉత్సాహం ఈసారి ప్రధాన ఆకర్షణగా మారింది.
Perni Nani: మంత్రి కొల్లు రవీంద్ర ఆస్తులపై పేర్నినాని సంచలన వ్యాఖ్యలు..
