ఈమధ్యకాలంలో వన్యప్రాణులు అరణ్యాలు వీడి జనవాసాలకు చేరుతున్నాయి. చిరుతలు జనం మీదకు వస్తున్నాయి. ఇళ్ళలో వుండే ఆవులు, మేకలు, గొర్రెల్ని హతమారుస్తున్నాయి. తాజాగా మహారాష్ట్ర లో కూరగాయల ట్రేలో దూరిందో చిరుత కూన. చంద్రపూర్ జిల్లాలోని మూల్ తాలూకా లోని ఉథడ్ పేట్ గ్రామ రైతు కిన్నకే అనే రైతు కూరగాయలు సాగు చేస్తున్నాడు. ఈక్రమంలో పొలంలో కూరగాయలు తెంపి ట్రే లో పోసే క్రమంలో పై కప్పి ఉంచిన గోతాన్ని తీశాడు. అప్పటికే అక్కడ చిరుతపులి పిల్ల వుంది. దానిని విషయం గ్రామస్తులకు తెలియజేయడంతో భారీగా జనం తరలివచ్చారు. ఆ చిరుత కూనను పరిశీలించారు. విషయం అటవీశాఖ అధికారులకు చేరవేయగా అక్కడికి వచ్చిన అధికారులకు చిరుతకూనను అప్పగించారు. చిరుత కూన కావడంతో ఎవరికీ హాని చేయలేదని రైతు తెలిపాడు.
ఇదిలా వుంటే.. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం కంటేగాంలో చిరుత సంచారం కలకలం రేపింది. కంటేగాం శివారులో ఓ రైతుకు చెందిన ఆవుపై దాడి చేసి చంపేసింది. చిరుత సంచారంతో నిగిని,బాబేరా,కంటేగాం గ్రామాల జనం భయాందోళనకు గురవుతున్నారు. విషయం తెలిసిన అటవీశాఖ అధికారులు చిరుత సంచారం ఉందని అప్రమత్తంగా ఉండాలని గ్రామస్తులకు సూచించారు. చనిపోయిన ఆవుకు పరిహారం ఇస్తామని రైతుకు హామీ ఇచ్చారు అధికారులు.
Tirumala Bears: తిరుమలలో ఎలుగుబంట్ల హల్ చల్