కేంద్రంపై శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. దక్షిణ భారత దేశంపై కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని మండిపడ్డారు. నల్లగొండ లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు గుత్తా సుఖేందర్ రెడ్డి. అప్రజాస్వామిక విధానాలతో రాష్ట్రాల హక్కులను కేంద్రం కాలరాస్తోందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన రూ.23వేల కోట్ల నిధులు కేంద్రం నిలిపివేసిందని ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్ర విధానాలు దేశమగ్రతకు మంచిది కాదని.. రాష్ట్రంలో జాతీయ ఉపాధి హామీ పథకం పనులు బ్రాహ్మండంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
డీజిల్, పెట్రోల్ ధరలతోపాటు పాలు..పెరుగు.. చివరకు స్మశాన వాటికలు కూడా వదలకుండా జీఎస్టీ పోటు వేశారని ఎద్దేవా చేసారు. సీబీఐ, ఈడీ వ్యవస్థలను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. శివసేన విషయంలో బెదిరించి ప్రభుత్వ మార్పకు తెగబడ్డారని ఆరోపించారు. దేశంలో పేదల బతుకులు దుర్భరంగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేసారు. పెరిగి ధరలతో దేశ ఆర్థిక వ్యవస్థ కూదేలయ్యిందని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న అధికార పార్టీ రాష్ట్రంలో ధర్నాలు చేస్తోందని నిప్పులుచెరిగారు. నిత్యావసర సరుకులధరలు తగ్గించి నూతన జీఎస్టీ విధానాలు విరమించుకోవాలని, రాష్ట్రాల హక్కులను కాపాడాలని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు.
Lightning strikes: పిడుగుల బీభత్సం.. యూపీలో 14 మంది, బిహార్‌లో 5గురు బలి
