Site icon NTV Telugu

LB Nagar Politics: ప్రచారంపై ప్రత్యేక దృష్టి.. సభలు, రోడ్‌షోలతో హోరెత్తుతున్న ఎల్‌బి నగర్..

Brs,bjp,congress

Brs,bjp,congress

LB Nagar Politics: ఓటింగ్ సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. అధికార బీఆర్‌ఎస్ పార్టీ మరోసారి పట్టు సాధించాలని, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఈసారి విజయం సాధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే ఒక రౌండ్ ప్రచారాన్ని పూర్తి చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రెండో రౌండ్ ప్రచారానికి సిద్ధమైంది. ఇందులో భాగంగా ఎల్ బీ నగర్ నియోజకవర్గంలో బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, సీఎం కేసీఆర్ రోడ్ షోలు, సభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రోడ్ షోలు, సభలకు పెద్దఎత్తున తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ఎల్బీ నగర్ నియోజకవర్గంలో బీజేపీ నుంచి పోటీ చేసిన సామ రంగారెడ్డి ఈసారి ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. గత గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఎల్‌బీనగర్‌లోని 11 డివిజన్లలో బీజేపీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అనంతరం లింగోజి గూడ బీజేపీ కౌన్సిలర్‌ ఆకుల రమేష్‌గౌడ్‌ కన్నుమూశారు. దీంతో ఎల్బీనగర్‌లో బీజేపీకి 10 మంది కార్పొరేటర్లు ఉన్నారు.

అన్ని మండలాల్లో పర్యటించి ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని కూడా రాష్ట్ర బీజేపీ నాయకత్వం గౌరవప్రదంగా తీసుకుంది. ఈసారి ఆ స్థానంలో కాషాయ జెండా ఎగురవేయాలనే ఉద్దేశ్యంతో అగ్రనేతల సమావేశాలు నిర్వహించి ప్రచారం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఎల్బీ నగర్‌లో ప్రత్యేక కార్యాచరణతో ప్రజల్లోకి వెళుతుంది. ప్రభుత్వ వైఫల్యాలను సాకుగా చూపుతూ బీఆర్ ఎస్ కు తామే ప్రధాన ప్రత్యామ్నాయమని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. కాంగ్రెస్ తరుపున మధు యాష్కీ గారు బరిలోకి దిగారు.బీసీ నాయకుడు కావడం, ఈ ప్రాంతంలో బలమైన బీసీ ఓటు బ్యాంకు ఉండడంతో ఆయనను తనవైపుకు తిప్పుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఎల్బీ నగర్‌లో కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ రోడ్‌ షో నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారు.
IND vs NZ Semi Final 2023: భారత్, న్యూజిలాండ్‌ సెమీ ఫైనల్ మ్యాచ్‌కు బెదిరింపు.. వాంఖడే స్టేడియం భారీ భద్రత!

Exit mobile version