ధర్మయుద్ధంలో బీజేపీయే గెలిచిందని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షడు లక్ష్మణ్ అన్నారు. బండి సంజయ్ అరెస్టు ..తదనంతర పరిణామాలపై ఆయన మీడియాతో మాట్లాడుతూ..టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి చురకలు అంటించారు. కోర్టులో ధర్మం గెలిచిందని కోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు.నైతిక బాధ్యత వహించి సీఎం రాజీనామా చేయాలన్నారు.
Read Also:అధికారులు పింక్ దుస్తులు వేసుకుని గుండాగిరి చేస్తున్నారు: తరుణ్ చుగ్
రాజకీయంగా ఎదుర్కొలేక తప్పుడు కేసులుపెట్టారన్నారు. తప్పుడు కేసులకు బీజేపీ ఏమాత్రం అదరదు బెదరదని లక్ష్మణ్ పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే, దళిత మహిళ బొడిగే శోభను అక్రమంగా అరెస్టు చేశారని ఆయన మండిపడ్డారు. కేసీఆర్ 8వనిజాం ..సర్ధార్ పటేల్‌ను కనీసం గౌరవించడం లేదు. చంద్రముఖి సినిమాలో గంగాలాగా సీఎం రోజు రోజుకు నిజాంగా మారుతున్నారని ఆయన గులాబీ బాస్‌పై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీని ఏం చేయలేదని ఈ సందర్భంగా లక్ష్మణ్ అన్నారు.
