Site icon NTV Telugu

Labours stuck in Flood: ఉప్పొంగిన పాలేరు వాగు.. చిక్కుకున్న 23 మంది కూలీలు

Labours Stuck In Flood

Labours Stuck In Flood

Labours stuck in Flood: రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మళ్లీ వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాలు కురుస్తాయని తెలియని కూలీలు ఇవాళ ఉదయం పనులకు వెళ్లారు. ఈ క్రమంలోనే సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందపురం-జి.కొత్తపల్లి మధ్యలో ఉద్ధృతంగా ప్రవహిస్తోన్న పాలేరు వాగులో 23 మంది వ్యవసాయ కూలీలు చిక్కుకున్నారు. ఒడ్డుకు చేరుకోలేక సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

కూలీలంతా మహబూబాబాద్‌ జిల్లా దంతాపల్లి మండలం చౌళ్లతండావాసులుగా గుర్తించారు. వీరంతా సుమారు 5 గంటలుగా సాయంకోసం ఎదురుచూస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో సుమారు 13.02 సెం.మీ వర్షపాతం నమోదైంది. దీంతో పరిసర ప్రాంతాల్లోని నీరంతా వచ్చి వాగులో చేరడంతో వాగు ఉప్పొంగుతోంది. అయితే, చిక్కుకున్న కూలీలను సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు స్థానిక అధికారులు.. ఉన్నతాధికారులను సంప్రదించింది. ఇప్పటికే రెవెన్యూ యంత్రాగాన్ని అప్రమత్తం చేసింది. వీరిని ఎలా బయటికి తీసుకురావాలనే దానిపై జిల్లా కలెక్టర్‌, ఎస్పీతో చర్చించినట్లు తెలుస్తోంది. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వం హెలికాప్టర్‌ సహాయంతో బయటికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.

CM KCR Review: వర్షాలపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష

మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచెర్ల గ్రామపంచాయతీ పరిధిలోని కోట్యా తండా, చాంప్ల తండాకు చెంది 23 మంది కూలీలు సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం ముకుందాపురం గ్రామానికి చెందిన ఓ రైతు కౌలుకు తీసుకున్నాడు. వానాకాలం పంట కోసం నాట్లు వేసేందుకు తానంచెర్ల గ్రామపంచాయతీ పరిధిలోని కోట్యా తండా, చాంప్ల తండాకు చెందిన కూలీలు 23మంది ఉదయం ఆటోలో ముకుందాపురం గ్రామశివారు లోని పాలేరు ఏటి వద్దకు వెళ్లారు. ఈ నేపథ్యం వరద ఉద్ధృతి పెరగడంతో కూలీలు అక్కడ చిక్కుకుపోయారు.

Exit mobile version