Site icon NTV Telugu

Kunamneni: CPI, CPM కలిసి సమావేశం అవడం ఇది తొలిసారి

Cpi,cpm

Cpi,cpm

Kunamneni: CPI, CPM కలిసి సమావేశం అవడం ఇది తొలిసారి హిస్టారికల్ అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర CPI CPM ఉమ్మడి సమావేశం నాంపల్లి గ్రౌండ్స్ లో ప్రారంభించారు. రెండు పార్టీల జెండాలు ఒక్కటి చేసి కొట్లాడదామన్నారు. 100 సంవత్సరాలు చరిత కలిగిన పార్టీ అన్నారు. ఈరోజు ఒక పండగ రోజు అని తెలిపారు. ఇది శుభోదయం, ఒక అరుణోదయమని తెలిపారు. దేశానికి దశ, దిశ చూపిన పార్టీలు ఎత్తిన జెండాలని, ఈ సమావేశం ఒక యూనిక్ అని తెలిపారు. బతికి ఉన్నంత కాలం జెండాను మోద్దాం.. చనిపోయాక జెండా కప్పుకొని చనిపోదామన్నారు. వాళ్ళకు అవసరం వస్తె వాళ్ళు మన దగ్గరకి వస్తున్నారని తెలిపారు. బీజేపీ జెండా మోసిన వాళ్లకి మనం దూరంగా ఉన్నామని స్పష్టం చేశారు. వాళ్ళంతట వాళ్ళు వస్తేనే మద్దతు ఇస్తున్నాం తప్ప మనం ఎన్నడూ వాళ్ళ వద్దకు వెళ్ళలేదని కూనంనేని వ్యాఖ్యానించారు.

Read also: Tammineni: ఈ గడ్డపై ఎగిరేది కాషాయ జెండా… గోల్కొండ కోట కింద బొంద పెడతాం

ఈ గడ్డ మీద కాషాయ జెండాను ఎరుగానివ్వడం కాదు, తరిమి తరిమి కొడతాం,గోల్కొండ కోట కింద బొంద పెడతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచం మొత్తం మళ్ళీ ఎర్ర జెండా వైపు చూస్తున్న క్రమంలో మనం ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కమ్యూనిస్టుల ఓట్లు సీట్లు లేకుండా పోతున్నాయి భవిష్యత్ ఉందా అని ఆలోచిస్తున్నారని అన్నారు. కమ్యూనిస్టుల భవిష్యత్ ఉందా అనేది కాదు, కమ్యూనిస్టులు లేకపోతే మీకు భవిష్యత్ ఉందా అనేది ఆలోచించండి? అని ప్రశ్నించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం ప్రతిపాదించిన చరిత్ర కాంగ్రెస్ ది కాదు, కమ్యూనిస్టులదే అన్నారు. సమస్త సంపదకు మూలం అయిన అన్నింటినీ కార్పొరేట్ పరం చేస్తున్నారని తెలిపారు. ఒకే దేశం ఒకే టాక్స్ అని చెప్పే మోడీ ఎందుకు ఒకే కులం అని చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Hombale Films: కొత్త సినిమాకి క్లాప్ కొట్టారు…

Exit mobile version