సాధారణంగా మనం చెప్పులు లేకుండా నడవడమే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటిది ఓ కళాకారిణి ఏకంగా చెప్పులు లేకుండా 9,999 మేకులపై కూచిపూడి నృత్యం చేసి అందరినీ అబ్బురపరిచింది. అంతేకాకుండా పలు ప్రపంచ రికార్డులను కూడా తన ఖాతాలో వేసుకుంది. హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఎన్టీఆర్ కళామందిరంలో జరిగిన ఓ కార్యక్రమంలో యువ నర్తకి పీసపాటి లిఖిత 9 నిమిషాలపాటు అమ్మవారిని స్తుతిస్తూ చేసిన కూచిపూడి నృత్యం అలరించింది. ముఖ్యంగా తొమ్మిది దుర్గావతారాలను లయబద్ధంగా…