NTV Telugu Site icon

KTR: నేడు సిరిసిల్లలో కేటీఆర్‌ పర్యటన..

Ktr

Ktr

KTR: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఉత్సవాలలో భాగంగా నిర్వహించే కార్యక్రమాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్నారు. ఉదయం 10.00 గంటలకు సిరిసిల్ల పాత బస్టాండు వద్ద గల అమర వీరుల స్థూపముకు నివాళులు అర్పించనున్నారు. ఉదయం 10:30 గంటలకు తెలంగాణ భవన్ సిరిసిల్లలో జరుగనున్న జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరవుతారు. అనంతరం 11 గంటలకు జెండా ఆవిష్కరణకు వచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

Read More: AP Election Results: ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు.. మారిన రాజకీయ పార్టీల మూడ్

రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఆదివారం తెలంగాణ భవన్‌లో జాతీయ జెండా, బీఆర్‌ఎస్ జెండాను ఎగురవేశారు. అనంతరం జరిగిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. తాను అధికారంలో ఉండి ఉంటే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నెల రోజుల పాటు జరుపుకునేవారన్నారు. తెలంగాణ అవతారం, కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత రేవంత్ రెడ్డికి లేదని, ఆయనకు ప్రజలే బుద్ధి చెప్పే రోజులు త్వరలో వస్తాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర 10వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ 60 లక్షల మంది పార్టీ కార్యకర్తల తరపున కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

Read More: Toll Fee: వాహనదారులకు షాక్.. అమల్లోకి పెరిగిన టోల్ ఛార్జీలు

రాష్ట్ర సాధన కోసం ఎందరో ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులందరికీ నివాళులు అర్పించారు. 2001లో మలిదశ ఉద్యమంతో సరికొత్త విప్లవం సృష్టించి చరిత్రను తిరగరాసి తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీని స్థాపించి తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చిన ఘనత కేసీఆర్‌దేనని గుర్తు చేశారు. జాతి కోసం ప్రాణాలు అర్పించినా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం దశాబ్ద కాలంలోనే అద్భుతమైన ప్రగతిని సాధించిందని అన్నారు. తెలంగాణ సాధన దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ఉద్యమంలో సహకరించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, యువకులు, బంధువులు అందరికీ అభినందనలు తెలిపారు. దశాబ్ది వేడుకల సందర్భంగా తెలంగాణ మరింత అభివృద్ధి చెంది దేశానికే ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?