NTV Telugu Site icon

KTR Tweet: సవాల్‌ విసిరినా కానీ.. సైలెంట్‌ గా వున్నారు..

Ktr Modi

Ktr Modi

KTR tweet even challenged Modi but did not get an answer: ప్రధాని మోడీ 8న తెలంగాణలో పర్యటించిన విషయం తెలిసిందే. అయితే హైదరాబాద్‌ వచ్చిన మోడీ వందే భారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ ను ప్రారంభించిన అనంతరం పరేఢ్‌ గ్రౌండ్స్‌ లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాగా.. తెలంగాణ అభివృధి గురించి ఒక్క మాట కూడా మోడీ నోట నుంచి రాలేదని బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు. తెలంగాణ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుంటే ప్రధాని ఒక్క మాట మాట్లాడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా ప్రధాని మోడీ, బీజేపీ కేంద్ర మంత్రికి సవాల్‌ విసిరారు. 9 ఏళ్లలో ఏ రాష్ట్రం అభివృద్ధి చెందిందో చెప్పాలని ట్విట్టర్‌ వేదికగా కోరగా ప్రధాని, బీజేపీ కేంద్ర మంత్రి నుంచి ఎటువంటి జవాబు రాలేదు.

దీంతో కేటీఆర్‌ నేను సవాల్‌ విసిరినా కానీ.. అక్కడి నుంచి నో ఆన్సర్‌ అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ పోస్ట్‌ వైరల్‌ గా మారింది. గత 9 ఏళ్లలో తెలంగాణ కంటే మెరుగైన పనితీరు కనబరిచిన ఒక రాష్ట్రము పేరు చెప్పాలని నరేంద్ర మోడీ లేదా ఏదైనా బాధ్యతగల బిజెపి కేంద్ర మంత్రిని సవాలు చేసా కానీ.. అటువైపు నుంచి స్పందన లేకపోవడంతో వారి అసమర్థత బయటపడింది కేటీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ 9 ఏళ్లలో ఎంత అభివృద్ధి చెందిందని చెబుతున్నా మోడీ జీ కి మాత్రం తెలంగాణ అభివృద్ధి కనపడక పోవడం హాస్యంగా వుందంటూ తెలిపారు. తెలంగాణ అభివృద్దిలో ముందుకు దూసుకుపోతుందని, తెలంగాణలా ఏ రాష్ట్రం అభివృద్ధి చెందింది అని ప్రశ్నించారు కేటీఆర్‌. రాజకీయాల కోసమే ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చారని మంత్రి కేటీఆర్ విమర్శించారు.

Read also: Iftar Dawaat: ఎల్బీస్టేడియంకు సీఎం.. ఆ ప్రాంతాల్లో నో ఎంట్రీ

తాజాగా మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌ వేదికగా ప్రధాని మోడీకి సవాల్‌ విసిరిన విషయం తెలిసిందే.. గడిచిన తొమ్మిదేండ్లలో తెలంగాణలా అభివృద్ధి సాధించిన రాష్ట్రాన్ని ప్రధాని చూపించాలని సవాల్ విసిరారు. హైదరాబాద్‌లో జరిగిన బహిరంగ సభలో మోడీ ప్రసంగించిన మరుసటి రోజు కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా సవాల్ విసిరారు. తెలంగాణాలో ఇంత అభివృద్ది జరుగుతున్నా.. తెలంగాణ సాధించిన విజయాలను గురించి ప్రధాని ఒక్క మాట కూడా మెచ్చుకోలేదని కేటీఆర్ మండిపడ్డారు.