NTV Telugu Site icon

KTR: దళితబంధుని కూడా కాపీ కొడతారేమో!

Ktr Sicicilla

Ktr Sicicilla

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డారు మంత్రి కేటీఆర్. తెలంగాణ ప్రభుత్వం తెస్తున్న పథకాలను మోడీ సర్కార్ కాపీ కొడుతోందని, దళిత బంధుని కూడా కాపీ కొడతారేమోనన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన దళిత బంధు చెక్కులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు.5 65 ఏళ్ళలో కాని పనులు ఎన్నో ఆరు ఏళ్ళలో చేసుకున్నాం అన్నారు.

రైతులకు పెట్టుబడి సాయంతో పాటు రైతు చనిపోతే వారి కుటుంబాలకు రైతు బీమా ఇస్తూ అండగా ఉంటున్నారు సీఎం కేసీఆర్. ఆయన ఓ రిఫార్మర్ ఓ ట్రాన్స్ ఫార్మర్ గా ఉండే నాయకుడు. సమాజంలోని అసమానతలు తొలిగి సమానత్వం కలిగించేలా ప్రభుత్వం పని చేస్తుంది. దేవుడు పుట్టించినప్పుడు కులం పెట్టలేదు..అందరికీ ఒకే శరీరం ఇచ్చాడు. తెలివితేటలు, ప్రతిభ ఎవడబ్బ సొత్తు కాదు. మనమే కులం మతం అని పుట్టించుకుని పంచాయితీ లు పెట్టుకుంటున్నాం అన్నారు.

దేవుడి సృష్టించిన మనుషులే కులం మతం అంటూ ఘర్షణలు పెట్టుకుని దిగ జారిపోతున్నాం. 1985లో భారత దేశం చైనా ఒకేలా ఉండేవి. 35 ఏళ్ళలో చైనా వాళ్ళు తెలివిగా ఉండి అమెరికా జపాన్ లతో పోటీ పడి దూసుకుపోతున్నారు. మన ఎకానమీ కంటే ఆరురెట్లు చైనా ఎకానమీ ముందు స్థానంలోకి వెళ్ళింది. చైనా లో కులం మతం పంచాయితీలు వదిలి పెట్టుబడులు అభివృద్ధి వైపు అడుగులేస్తున్నారు. మత పిచ్చి మత గజ్జితో మనదేశంలో అభివృద్ధి కుంటుబడింది. సిద్దిపేటలో అప్పట్లోనే కేసీఆర్ దళిత జ్యోతి కార్యక్రమం పెట్టారు. ఒక విప్లవాత్మక మార్పుగా దళిత బంధు పథకం తెచ్చారు కేసీఆర్.

Read Also: KTR: బలహీనవర్గాల కోసం బలంగా నిలబడే వ్యక్తి కేసీఆర్

20 లక్షల కుటుంబాలకు 10 లక్షలు ఇవ్వండి అని బండి సంజయ్, మోడీలని కోరుతున్నాం. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ తప్ప బీజేపీ వాళ్ళకు ఏమీ తెలియదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. భారత దేశంలోని దళిత బిడ్డలకు దిక్సూచిలా దళిత బంధు నిలుస్తుందన్నారు. పీఎం కిసాన్ ఎట్లా కాపీ కొట్టి పెట్టారో దళిత బంధు కూడా కాపీ కొట్టి దేశంలో పెట్టే పరిస్థితి వస్తుందన్నారు మంత్రి కేటీఆర్. అందరూ వాహనాలు కొని గిరాకీ లేక అమ్ముకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. 10 లక్షలతో మీ వ్యాపారం అభివృద్ధి జరిగేలా చూసుకోవాలని దళిత బంధు లబ్ధిదారులకు కేటీఆర్ సూచించారు.