KTR : బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరో కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. గత రెండు నెలలు గా యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల రైతులు దయనీయ పరిస్థితుల్లో ఉన్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ హయాంలో ఆరు నెలల ముందే ఎరువుల బస్తాలు సిద్ధంగా ఉంచేవారని, ఇప్పుడు ఒక ప్రణాళిక కూడా చేయట్లేదని ఆయన అన్నారు. అంతేకాకుండా.. కాంగ్రెస్ పార్టీ దున్నపోతు మీద వాన కురిసిన విధంగా వ్యవహరిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. ఢిల్లీకి రాహుల్ గాంధీని కలవడానికి వెళ్లి రేవంత్ రెడ్డి ఎదో ఒక పేపర్ ఇచ్చి వస్తున్నారని, ఇక్కడ పోలీసులను పెట్టి ఎరువుల బస్తాలు అమ్మే పరిస్థితి వచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
CM Revanth Reddy: హైదరాబాద్‌ను ఇలానే వదిలేద్దామా.. మూసీ ప్రక్షాళనను అడ్డుకోవడం ఎందుకు..?
ఏ ఊరికి పోయినా చేంతాడు అంత లైన్ కనిపిస్తుందని, ఇంత జరుగుతున్నా రాష్ట్రంలో ఎరువుల కొరత లేదు అని ప్రభుత్వం మాట్లాడుతోందని ఆయన అన్నారు. 24 గంటలు బురద రాజకీయాలు చేస్తున్నారని, మాకు మరో అనుమానం ఉందని, బ్లాక్ మార్కెట్ లో కాంగ్రెస్ నేతలు అమ్ముతున్నారు అని అనుమానం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఏమో కొరత లేదు అంటున్నాడని, ఢిల్లీలో వాళ్ళ ఎంపీ లు ఏమో యూరియా కోసం ధర్నా లు చేస్తున్నారని, పదేళ్ల లో రాని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందని కేటీఆర్ ప్రశ్నించారు.
Asia Cup 2025: బెంచ్‌లో ‘ఆ నలుగురు’.. భారత తుది జట్టు ఇదేనా?
