Minister KTR: దుబాయ్, సౌదీ గురించి మనం ఎన్నో సార్లు వింటుంటా. అక్కడకు పని చేసేకి వెళితే చాలా దారుణంగా ఉంటుందని నరకం చూపిస్తారని ప్రాణాలతో వున్నా శవంగా బతకాలని ఇలాంటివి మనం వింటుంటాం. కానీ.. కొందరు అవి కొట్టి పడేస్తుంటారు. కుటుంబ భారం మోసేందుకు దుబాయ్, సౌదీ వెళితే సంపాదించవచ్చని కుటుంబాన్ని పోసించుకోవచ్చనే ఆలోచనతో తన కుటుంబానికి దూరంగా వెళ్లి నరకయాతన పడుతుంటారు. అలాంటిదే ఓ ఘటన హైదరాబాద్ వాసులు అనుభవిస్తున్నారు. కుటుంబ భారంతో దుబాయ్ వెళ్లిన తన చెల్లెలు నరక యాతన పడుతుందని తనని రక్షించి హైదరాబాద్‌కు రప్పించాలని కోరుతున్నాడు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు, ఎంబీటీ నాయకుడు అంజదుల్లా ఖాన్ కు, వేడుకుంటున్నాడు. కేంద్రంతో మాట్లాడి తన సోదరిని కాపాడాలని కోరుకుంటున్నాడు.
Read also: Aswani Dutt Petition: గన్నవరం ఎయిర్ పోర్ట్ విస్తరణ.. కౌలు చెల్లించాలని హైకోర్ట్ ఆదేశాలు
పాతబస్తీ యాకుత్ పురాకు చెందిన సకీనా ఫాతిమాకు భర్త ఇటీవలే మృతిచెందాడు. నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో తన కూతురు, వృద్దాప్యంలో ఉన్న తల్లి రహీం ఉన్నీసా పోషణ కష్ట తరంగా మారింది. సకీనా ఫాతిమా దుబాయ్‌లో పనిమనిషిగా చేస్తే లక్షల్లో జీతం ఉంటుందని ఓ ఏజెంట్ ద్వారా తెలుసుకుంది. దీంతో మొదట విజిటింగ్వీసా మీద మూడు నెలలు దుబాయ్‌కు పంపిస్తానని, అక్కడ నచ్చితే పనిచేయి లేకుంటే మూడు నెలల్లో తిరిగి వెనక్కి రావచ్చని ఏజెంట్ సకీనా ఫాతిమాకు చెప్పాడు. దీంతో సదరు ఏజెంట్ద్వారా విజిటింగ్వీసా మీద ఫిబ్రవరి 6, 2022లో ఆమె దుబాయ్ వెళ్ళింది. అక్కడ ఓ బ్రోకర్రెండు లక్షలకు సకీనా ఫాతిమాను ఓ షేక్‌కు అమ్మేశాడు. అది తెలియక అక్కడ ఓ షేక్ ఇంట్లో రోజుకు 18గంటల చొప్పున పనిమనిషిగా చేయసాగింది. రెండు నెలల తర్వాత సదరు నాకు ఇక్కడ నచ్చడం లేదని, తనను ఇండియాకు పంపించాలని షేక్‌ను వేడుకుంది. దీంతో సదరు షేక్ మే, 5వ తేదీన బస్సులో సౌదీ అరబ్‌కు పంపించాడు.
Read also: Tim Southee: సూర్య గొప్ప ఆటగాడేమీ కాదు.. సౌథీ షాకింగ్ కామెంట్స్
అక్కడ ఒక్క ఇల్లు కాకుండా మూడు నాలుగు ఇళ్ళలో నిరంతరాయంగా పనిచేయిస్తూనే ఉన్నారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా, అన్నం కూడా సరిగ్గా పెట్టకుండా హింసించసాగారు. చివరకు తన తల్లి మరణించిందని చెప్పినా ఫాతిమాను ఇండియాకు పంపలేదు. ఇక తల్లి చనిపోయిన బాధలో ఉన్న ఫాతిమా.. షేక్ అమ్మ పిలిచినప్పటికీ లేవకపోవడంతో తన కుమారుడు షేక్‌కు చెప్పింది. వెంటనే షేక్ బెల్టు, వైర్‌తో సకీనాను దారుణంగా కొట్టాడు. ఆమె ప్రయివేట్ పార్ట్స్‌పై కూడా విచక్షణ రహితంగా దాడిచేశాడు.దీంతో ఆమె అక్కడి నుంచి తప్పించుకుని స్థానికంగా ఉన్న ఓ పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించగా.. పోలీసులు విచారించి తిరిగి ఆమెను షేక్ దగ్గరకు పంపించారు. దీంతో మా మీదనే ఫిర్యాదు చేస్తావా..? అంటూ సకీనా ఫాతిమా ఫోన్ లాక్కొని, మరో సారి దాడిచేసి ఓ గదిలో నిర్భందించాడు షేక్. కాగా, అక్కడే ఉండే మరో మహిళ ఫోన్‌ద్వారా తనపై జరిగిన ఆకృత్యాలను వీడియో, ఫొటోలు తీసి ఇండియాలోని కుటుంబ సభ్యులకు పంపింది సకీనా. దీంతో అక్కడ జరిగిన ఘాతక అంతా చూసి తన సోదరుడు సయ్యద్ నిర్ఘాంత పోయాడు. కేంద్రానికి, మంత్రి కేటీఆర్ కి తన సోదరిని అక్కడి నుంచి రప్పించి, తనకు అప్పగించాలని కోరుతున్నాడు. మరి దీనిపై మంత్రి, కేంద్ర స్పందిస్తుందా? సకీనాకు ఆ షేక్ చేసే అరాచకాలనుంచి బయట పడుతుందా? వేచి చూడాలి.
Narendra Modi: జోడో యాత్రపై మోడీ వ్యంగ్యాస్త్రాలు.. అధికారం కోసమే!