KTR: సిట్టింగ్ లను మార్చి ఉంటె బాగుండేది..! కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ లను మార్చి ఉంటె బాగుండేదనే అభిప్రాయం బలంగా ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టీ.రామారావు అన్నారు. జహీరాబాద్ పార్లమెంటు సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దళిత బంధు నిజాం సాగర్ మండలం లో మొత్తం ఇచ్చినా మిగతా వర్గాలు మనకు ఓట్లు వేయలేదన్నారు. ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష పడేలా సమాజం తయారైందన్నారు. ‘బంధు ‘పథకాల ప్రభావం మనపై పడిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ లను మార్చి ఉంటె బాగుండేదనే అభిప్రాయం బలంగా ఉందన్నారు.
పార్లమెంటు ఎన్నికల్లో అలాంటి పొరపాట్లు జరగనివ్వమని అన్నారు. పార్టీ అన్నపుడు ఎత్తులు పల్లాలు తప్పవని అన్నారు. జిల్లాల సంఖ్య తగ్గించేందుకు రేవంత్ రెడ్డి కమిషన్ వేస్తామంటున్నారని కేటీఆర్ అన్నారు. కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా ? అని ప్రశ్నించారు. ఇక మరోవైపు BRS ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన శక్తి తో గెలవలేదు .మన బలహీనతలే కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణమన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ కొందరు సొంత అభ్యర్థులనే ఓడించుకున్నారని అన్నారు. కార్యకర్తలది తప్పు కాదు నాయకులుగా మనమే భాద్యత వహించాలని కోరారు. పార్టీలో ప్రక్షాళన జరగాలని, గ్రూపు తగాదాలకు స్వస్తి పలకాలని అన్నారు.
Also Read
Read also: Guntur Kaaram: సలార్ ట్రైలర్ 32.58 మిలియన్ వ్యూస్… ఈరోజు ఏం చేస్తాడు మీ హీరో?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత అతి త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. పార్లమెంటు ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి పార్టీ ఎంపీ ఎన్నికల్లో పుంజుకోవాలని యోచిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే పార్టీ అధిష్టానం వరుస సమావేశాలు నిర్వహించింది. మాజీ మంత్రి కేటీఆర్‌ను సికింద్రాబాద్ లేదా మల్కాజిగిరి నియోజకవర్గం నుంచి ఎంపీగా నిలబెట్టాలని గులాబీ బాస్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన భారత రాష్ట్ర సమితి పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు అన్ని వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని భారత రాష్ట్ర సమితి పార్టీ కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.సోషల్ మీడియాలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వరుసగా పోస్టులు పెడుతూ భారత రాష్ట్ర సమితి పార్టీ మళ్లీ ఊపందుకుంది.
DCP Srinivas Rao: రాయదుర్గం సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిడ్నాప్ కేసు.. డీసీపీ శ్రీనివాసరావు క్లారిటీ..
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా ప్రజావాణికి మరో బ్రేక్.. జూన్ 22 నుంచే మళ్లీ ప్రారంభం..!
-
Off The Record : కేటీఆర్‌కు సమాంతరంగా మరో వర్కింగ్ ప్రెసిడెంట్ పై కేసీఆర్ కసరత్తు
-
Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
-
Shashi Tharoor: రాహుల్‌గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
-
Vaibhav’s Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!