KTR: ఆరు గ్యారంటీల్లో ఒక్కటి అమలు చేసి.. ఆడోళ్లకు,మగోళ్లకు గొడవ పెట్టారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR: ఆరు గ్యారంటీ లో ఒక్కటి అమలు చేసి మోగొల్లకు మహిళకు తకులాట పెట్టారని సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఉదయం సిరిసిల్ల పట్టణం శాంతి నగర్ లోనీ కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ గెలుపుకోసం పలు వార్డులలో ప్రచారం నిర్వహించి, కార్నర్ మీటింగ్ లో కేటీఆర్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నేత కార్మికుల కోసం 3 వేయిక కోట్ల రూపాయల ఖర్చు చేసుకొని కార్మికులను కాపాడుకున్నామన్నారు. 5 ఏళ్లలో ఒక్క రూపాయి మందు పంచలేదు.. మీరు నాకు ఇచ్చిన దయ.. రాజకీయంగా జన్మనిచ్చింది సిరిసిల్ల నే అన్నారు.
Read also: One Nation One Election: ‘ఒక దేశం-ఒకే ఎన్నికల’ విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తాం..?
Also Read
సిరిసిల్ల పట్టణం అతి సుందరంగా తీర్చి దిద్దుకున్నామన్నారు. మీరు నన్ను ఇక్కడా గెలిపించిన కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపెట్టి గెలిచింది. మోచేతికి బెల్లం పెట్టీ మోసపూరిత హామీలతో గెలిచిందన్నారు. ఆరు గ్యారంటీలో ఒక్కటి అమలు చేసి మోగొల్లకు మహిళకు తకులాట పెట్టిండన్నారు. ఆరు గ్యారంటీలు అమలు అయ్యాయా చెప్పండి? అని ప్రశ్నించారు. అబద్ధాలు చెపితే డిజిటల్ ప్రపంచలో ఒక్క నిమిషాల్లో దొరికిపోయారన్నారు. అన్నమో రామచంద్ర అనే పరిస్థితి వచ్చింది కేసీఆర్ ప్రభుత్వం పోయాకా అన్నారు. తెలంగాణ తెచ్చిన కెసిఆర్ ను పట్టుకొని కాంగ్రెస్ పార్టీ అనేక మాటలు, భుతులు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 100 రోజుల్లో రైతు రుణమాఫీ, ఫించన్లు వచ్చాయా? అని ప్రశ్నించారు. ఓట్లు చేసుకునేటప్పుడు ఒక లెక్క ఓట్లు వేయించుకున్నాకా ఒక లెక్క ఉంది కాంగ్రెస్ పార్టీ తీరన్నారు.
Read also: Ram Charan: గేమ్ చేంజర్ మరో సీన్ లీక్.. సినిమా హైలెట్ సీన్ ఇదే..
కేసీఆర్ మల్ల కావాలంటే 13 తేదీన కారు గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు. తెలంగాణలో శాసించే అధికారం వస్తుందన్నారు. రాముడు అందరి వాడన్నారు. మతం పేరుతో ఓట్ల రాజకీయం చేస్తున్నారని తెలిపారు. వేములవాడ రాజన్న, కొండగట్టు దేవాలయాలు బిజెపి పుట్టక ముందు నుండే ఉండేవన్నారు. సిరిసిల్లలో అనేక అభివృద్ధి పనులు చేసినా, బీజేపీ ఒక్క పని చేసిండా శిలాఫలకం అన్న వేసిండా వారికి ఎందుకు ఓటు వేయాలన్నారు. మోడీ ముడి చమురు ధరలు తగ్గినా పెట్రోలు, డీజిల్ రెట్లపై పన్నులు వేసి వసూలు చేసారన్నారు. మనకు ప్రధాన మంత్రి కాదు ఫైరమైన ప్రధాన మంత్రి అన్నారు. ఆప్ కీ బార్ 420 అంటున్నారని తెలిపారు. అక్కరికి రానీ సుట్టాలకు ఎందుకు ఓటు వేయాలన్నారు. నాకు జోడి దారు దొరికితే రాష్ట్రం, కేంద్రం పై పోరాడే శక్తి వస్తుందన్నారు.
IPL 2024 Orange Cap: ఈ సీజన్లో ఆరెంజ్ క్యాప్ కోహ్లీకి దక్కేనా..?
తాజావార్తలు
-
Missing Girls: హైదరాబాద్‌లో ముగ్గురు మైనర్ బాలికలు అదృశ్యం
-
Jagga Reddy : కేటీఆర్ రక్తంలో నిజాయితీ, కృతజ్ఞత లేదు
-
Rohit Sharma Century: హిట్ హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ రికార్డు సెంచరీ.. గెలుపు దిశగా ఇండియా..
-
Pregnancy Tips : నువ్వులు తినడం వల్ల గర్భస్రావం అవుతుందా.?
-
Supreme Court : ప్రైవేట్ వర్సిటీల ఇష్టారాజ్యంపై సుప్రీంకోర్టు సీరియస్.!
ట్రెండింగ్
-
Jagannath Prasadam Recipe : జగన్నాథుడి ప్రసాదం మాల్పువా.. ఇంట్లోనే ఇలా చేస్తే రుచి అదుర్స్.!
-
Rainy Season Tips: వర్షాకాలంలో గోడలకు, మెట్లకు పాకురు పట్టిందా.? ఈ చిట్కా ట్రై చేయండి.!
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్‌పైనే అందరి చూపు!