NTV Telugu Site icon

Minister KTR: డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, పంపిణీపై కేటీఆర్ సమీక్ష..

Ktr

Ktr

Minister KTR: జీహెచ్‌ఎంసీ పరిధిలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, పంపిణీపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఎవరికి డబుల్ బెడ్ రూమ్ పంపిణీపై న్యాయంగా వ్యవహరించాలని అధికారులను సూచించారు. అన్యాయం జరగకుండా ప్రతి పేదవాడికి డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీ న్యాయపరంగా జరగాలని అన్నారు. ఇళ్ల నిర్మాణం కూడా త్వరలో చేయాలని సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తలసాని, సబిత, మహమూద్ అలీ హాజరయ్యారు.

Read also: Cinema At Manipur: మణిపూర్‌లో 23 ఏళ్ల తరువాత.. హిందీ సినిమా ప్రదర్శన

రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలు ఆత్మగౌరవంతో జీవించేందుకు కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించి ఇస్తున్న సంగతి తెలిసిందే. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా పేదలకు డబుల్ బెడ్ రూం ఇండ్లను ప్రభుత్వం నిర్మిస్తోంది. 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లోని పేదలకు సీఎం కేసీఆర్ తీపి కబురు అందించారు. నిన్నటి నుంచే హైదరాబాద్‌లో లక్ష డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు మంజూరు చేస్తామని కేసీఆర్‌ ప్రకటించారు. గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కేసీఆర్ ప్రభుత్వం గతంలో పేదలకు ఇచ్చిన నివాసం ఇరుకు గది మాత్రమేనన్నారు.

Read also: Jailer: కమల్ లైఫ్ టైమ్ రికార్డుకి ఆరు రోజుల్లోనే ఎండ్ కార్డ్…

అందుకు భిన్నంగా బీఆర్ ఎస్ ప్రభుత్వం పేదల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు రెండు పడక గదులతో కూడిన ఇళ్లను నిర్మించి ఉచితంగా అందజేస్తోంది. దీన్ని ప్రభుత్వం నిర్విరామ ప్రక్రియగా కొనసాగిస్తోందన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్న లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను అర్హులైన పేదలకు నేటి నుంచి ప్రభుత్వం అందజేస్తోంది. సొంత భూమి ఉండి ఇల్లు కట్టుకోలేని పేదల కోసం ప్రభుత్వం గృహలక్ష్మి అనే పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద మూడు దశల్లో ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులకు మూడు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తారు. ముందుగా ఒక్కో నియోజకవర్గంలో 3 వేల మందికి లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి వికలాంగులకు గృహలక్ష్మి పథకంలో ఐదు శాతం రిజర్వేషన్లు కల్పించిందని కేసీఆర్ అన్నారు.
Kushi: అతి చేశారా? ‘ఖుషి’ చేశారా?

Show comments