NTV Telugu Site icon

Minister KTR: జమ్మూ హెలికాప్టర్ ప్రమాదంలో సిరిసిల్ల వాసి మృతి.. కేటీఆర్ సంతాపం

Ktr Armi Jawan

Ktr Armi Jawan

Minister KTR: జమ్ముకశ్మీర్‌లో ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్ పల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన అనిల్ అనే జవాన్ మృతి చెందడం పట్ల మంత్రి కేటీఆర్ సంతాపం తెలిపారు. ప్రమాదంలో యువ జవాన్‌ మృతి చెందడం బాధాకరమన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనిల్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు.

Read also: Talasani Srinivas: ఎవరుపడితేవాళ్లు అడిగితే ఇచ్చేవి కావు నంది అవార్డ్స్‌.. తలసాని కీలక వ్యాఖ్యలు

బోయినపల్లి మండలం మల్కాపూర్‌కు చెందిన పబ్బల మల్లయ్య, లక్ష్మి దంపతుల కుమారుడు అనిల్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇండియన్ ఆర్మీలో చేరాడు. దాదాపు 11 ఏళ్లుగా ఆయన విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం CFN AVN టెక్నీషియన్‌గా పని చేస్తున్నారు. ఎనిమిదేళ్ల క్రితం సౌజన్యతో వివాహమైంది. ఈ దంపతులకు అయాన్ మరియు ఆరవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. అనిల్ నెల రోజుల కిందటే స్వగ్రామానికి వచ్చి రెండో కుమారుడి పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. తన అత్తగారి గ్రామంలో ఏర్పాటు చేసిన బీరప్ప ఉత్సవానికి కూడా వెళ్లాడు. పది రోజుల కిందటే గ్రామం వదిలి మళ్లీ డ్యూటీలో చేరాడు. ఈ క్రమంలో విధుల్లో భాగంగా గురువారం ఆయన హెలికాప్టర్‌లో ప్రయాణించారు. హెలికాప్టర్ కుప్పకూలడంతో అతడు చనిపోయాడు. ఈ విషయం తెలియగానే గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు అందరినీ కలిచివేసింది. శుక్రవారం సాయంత్రం అనిల్ మృతదేహం మల్కాపూర్ గ్రామానికి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఆయన మృతికి తెలంగాణ ప్రణాళికా సంఘం కుమారుడు బోయినపల్లి వినోద్ సంతాపం తెలిపారు. అనిల్ మృతి బాధాకరమన్నారు. అనిల్ మృతి పట్ల టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా సంతాపం వ్యక్తం చేశారు.
Siddipet Crime: కొడుకులు పంచుకున్నారు.. భరించలేక తన చితికి తానే నిప్పంటించుకున్న తండ్రి

జమ్మూ కాశ్మీర్‌లో గురువారం ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలింది. కిష్త్వార్ జిల్లా మార్వా తహసీల్‌లోని మచ్నా గ్రామ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగినప్పుడు హెలికాప్టర్‌లో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వీరిలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, మరొకరు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన సాంకేతిక నిపుణుడు పబ్బళ్ల అనిల్ (29) సిరిసిల్ల జిల్లా వాసి. ఈ విషయం తెలియడంతో జిల్లా మొత్తం విషాదంలో మునిగిపోయింది.
KTR: హన్మకొండ, వరంగల్ జిల్లాల్లో కేటీఆర్‌ పర్యటన..17 అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Show comments