Site icon NTV Telugu

KCR : ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేసీఆర్, కేటీఆర్ భేటీ.. జూబ్లీహిల్స్ ఓటమిపై కీలక సమీక్షలు

Kcr Ktr

Kcr Ktr

KCR : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎదురైన ఓటమి నేపథ్యంలో పార్టీ వ్యూహాత్మక చర్యలు వేగం పెంచింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్ రావు ఎర్రవల్లి ఫాంహౌస్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో సమావేశమయ్యారు. ఓటమి కారణాలు, తదనంతర పరిణామాలు, భవిష్యత్ వ్యూహాలపై కేసీఆర్ కేటీఆర్‌తో సమీక్షించినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ బైపోల్స్ ఫలితాలు పార్టీ అంచనాలను తలకిందులు చేసిన నేపథ్యంలో, స్థానిక నాయకత్వం, క్యాడర్ స్థాయి బలహీనతలు, ప్రచార తీరుపై కేసీఆర్ ఆరా తీసినట్లు తెలుస్తోంది. బైఎలక్షన్లలో ఎదురైన ప్రతికూలతల నుంచి బయటపడడానికి ఏ మార్పులు అవసరమో పార్టీ అగ్రనేతలు అంతర్గతంగా చర్చించినట్టు వర్గాలు చెబుతున్నాయి.

CJI BR Gavai: రేపు విజయవాడకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. భారత రాజ్యాంగంపై ప్రసంగం!

ఇదిలా ఉండగా, కేటీఆర్ స్వయంగా జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ కార్యకర్తలతో సమావేశంకానున్నారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో నిర్వహించనున్న ఈ సమావేశానికి స్థానిక క్యాడర్‌ను భారీ సంఖ్యలో ఆహ్వానించారు. ఓటమి నేపథ్యంలో క్యాడర్‌లో నెలకొన్న అసంతృప్తి, స్థానిక స్థాయి లోపాలు, ప్రచార వ్యూహాలు, భవిష్యత్ బలోపేత కార్యక్రమాలపై కేటీఆర్ నేరుగా పార్టీ కార్యకర్తలతో చర్చించనున్నారు. జూబ్లీహిల్స్ ఓటమిని పాఠంగా తీసుకుని, పార్టీని మళ్లీ పటిష్టం చేయడానికి అవసరమైన చర్యలను ఈ సమీక్షల ద్వారా బీఆర్ఎస్ నిర్ణయించనున్నట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

ప్రత్యేక రెడ్ వెర్షన్, 200MP టెలిఫోటో కెమెరాలతో ఫ్లాగ్‌షిప్ సంచలనం Vivo X300 సిరీస్ లాంచ్ కు సిద్ధం..!

Exit mobile version