రాష్ట్రపతి అభ్యర్తి యశ్వంత్ సిన్హా హైదరాబాద్ రానున్న నేపథ్యంలో.. ప్రగతిభవన్‌లో నగరంలోని ఎమ్మెల్యేలతో మంత్రి కేటీఆర్ గురువారం ఉదయం భేటీ అయ్యారు. రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు జూలై 2న స్వాగత ఏర్పాట్లపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈనేపథ్యంలో బేగంపేట నుంచి జలవిహార్ వరకు భారీ ర్యాలీకి టీఆర్ఎస్ ప్లాన్‌ను సిద్ధం చేస్తోంది. సీఎం కేసీఆర్ టీఎర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలతో కలిసి జలవిహర్‌లో.. యశ్వంత్ సిన్హా భోజనం చేయనున్నారు. అయితే.. ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్‌ఎస్ పార్టీ పూర్తిస్థాయి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.
కాగా.. ఈనేపథ్యంలో ఏర్పాట్లు చేయాలని మంత్రులకు కేటీఆర్ ఆదేశించారు. జూలై 2వ తేదీన ఉదయం 10 గంటలకు యశ్వంత్ సిన్హా ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా జలవిహార్‌కు సిన్హా చేరుకుంటారు. అనంతరం ఉదయం 11 గంటలకు యశ్వంత్ సిన్హాకు మద్దతుగా టీఆర్ఎస్ పార్టీ సభ నిర్వహించనుంది. కాగా..ఈ సమావేశానికి టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అయితే.. యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇవ్వాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించినట్లు ట్వీట్ చేశారు. జూన్ 27న యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో ఆయనతో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. అయితే.. మరోవైపు ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్ధిగా ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్మును ఎంపిక చేయగా, ఈనెల 24న నామినేషన్ దాఖలు చేశారు.
United Nations: మహిళ కిడ్నాప్, అత్యాచారం.. చివరకు మనిషి మాంసాన్ని తినిపించారు.
