Site icon NTV Telugu

KTR : ఎక్కడ కూల్చేశారో.. అక్కడే గృహప్రవేశం చేయిస్తాం..

Ktr

Ktr

ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. వెలుగుమట్ల ప్రాంతంలోని భూదాన్ భూముల్లో రెండు రోజుల క్రితం రెవెన్యూ , మున్సిపల్ అధికారులు తొలగించిన గుడిసెల ప్రదేశాన్ని ఆయన స్వయంగా సందర్శించారు. పేదలు వేసుకున్న ఆశ్రయాలను కనికరం లేకుండా తొలగించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడిసెల తొలగింపుతో రోడ్డున పడ్డ బాధితులు కేటీఆర్‌ను కలవగానే తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. ఎన్నో ఏళ్లుగా నివాసం ఉంటున్న తమను ముందస్తు సమాచారం లేకుండానే ఖాళీ చేయించడంపై కన్నీటిపర్యంతమయ్యారు. ప్రభుత్వం పేదల పొట్ట కొడుతోందని, తమకు గూడు లేకుండా చేసిందని వారు కేటీఆర్‌కు వివరించారు. బాధితుల మాటలను ఓపికగా విన్న ఆయన, వారికి ధైర్యం చెప్పారు.

Bangladesh: బంగ్లా అధ్యక్షుడిపై విమర్శలు.. అంటే, యూనస్ అరాచకాలు నిజమేనా..

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. పేదల ఇళ్ల మీదకు వచ్చి దాడులు చేయడం, వారి గుడిసెలను పీకేయడం ప్రభుత్వ అమానుషత్వానికి నిదర్శనమని విమర్శించారు. ప్రభుత్వం పేదల పక్షాన ఉండాల్సింది పోయి, వారిని ఇబ్బందులకు గురిచేస్తోందని మండిపడ్డారు. బాధితులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని, వారికి న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. కేటీఆర్ పర్యటన నేపథ్యంలో వెలుగుమట్ల ప్రాంతంలో ఉత్కంఠ నెలకొంది. పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. కేటీఆర్ స్వయంగా కూల్చివేతలకు గురైన గుడిసెల వద్దకు వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. బాధితులకు తక్షణమే న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Epstein Files: బికినీ బేబీలతో స్టీఫెన్ హాకింగ్.. ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో సంచలనం..

Exit mobile version