KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాయి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒక్కో బూత్‌లో 50 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నట్లు అనుమానం ఉందని తెలిపారు. ఈ సమాచారం ఆయన సొంత దృష్టికి వచ్చినట్టు, నియోజకవర్గంలో తీవ్రమైన ఎన్నికల అవినీతి పరిస్థితులు ఉన్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా.. గత ఎన్నికల్లో కొన్ని కాంగ్రెస్ నాయకులు కొవ్వూరు కార్తీక్, దీపక్ శర్మ, మాధురి వంటి వ్యక్తులకు సాధారణంగా కేటాయించని ఓట్లు చేర్పించి ఫోటో, చిరునామాలు మార్చి దొంగ ఓట్లు నమోదు చేసినారని తెలిపారు. సుమారు 2 వేల దొంగ ఓట్లు తమ దృష్టికి వచ్చాయని, మరో పరిశీలనలో 14-15 వేల ఓట్లు అనుమానాస్పదంగా ఉన్నట్లు గుర్తించబడిందని చెప్పారు. అయితే, సమస్య ఒక్కో వ్యక్తికి పరిమితం కాకుండా అపార్టుమెంట్లలో 40–50 మంది ఉండే ఓటరు జాబితాలను ఉపయోగించి అనేక మంది వ్యక్తుల పేర్లతో ఓట్లు చేర్పించినట్టు, ఖైరతాబాద్‌లో ఉన్న వెంకటేష్ బిక్కిన, రమేష్ వంటి వ్యక్తులకు జూబ్లీహిల్స్‌లో ఓటు హక్కు కల్పించినట్లు ఆయన వివరించారు.
నామినేషన్ల ప్రక్రియకు ఇంకా వారం రోజుల సమయం ఉందని, ఈ సమయంలో దొంగ ఓట్లు చేయించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, తాము, పార్టీ నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఓటర్ల వివరాలు తెలుసుకోవడమే కాకుండా, సుమారు 20 వేల దొంగ ఓట్లను తొలగించాలి అని పేర్కొన్నారు.
Shocking : నాగర్‌కర్నూల్‌లో భయానక ఘటన.. అడవిలో సగం కాలిన మహిళ మృతదేహం!
