Site icon NTV Telugu

KTR: ఆ పరిస్థతి వస్తే.. కఠినంగా వ్యవహరించాలి

Ktr, Rajanna Sirisilla

Ktr, Rajanna Sirisilla

ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు కఠినంగా వ్యవహరించాలని మంత్రి కేటీఆర్ అన్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా జులై లో అత్యధిక వర్షం నమోదు అయ్యిందని పేర్కొన్నారు.ప్రాథమిక సమాచారం ప్రకారం సాధారణం కంటే 450 శాతం ఎక్కువ గా వర్ష పాతం నమోదైంద‌ని తెలిపారు. జిల్లాలో పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్ మాదిరి అసాధారణ పరిస్థితులు లేవని తెలిపారు. అయినా ఉదాసీనంగా, ఆలక్ష్యంగా ఉండొద్దని సూచించారు. ప్రాణ నష్టం జరగకుండా చూడాలని, ఆస్తి నష్టం కనిష్టానికి తగ్గించేలా చూడాలని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Read also: Godavari Floods: వరద కష్టాలు.. పడవలో వరుడి ఇంటికి పెళ్లికూతురు..

జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇరిగేషన్ అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులు ప్రో ఆక్టివ్ గా ఉండాలని హెచ్చిరించారు. రాజ‌న్న సిరిసిల్ల‌ జిల్లాలో ఒక్క ప్రాణ నష్టం ఉండొద్దని తెలిపారు. ప్రాఫర్ గా మున్సిపాలిటీలతో సహా అన్ని గ్రామాలలో సేఫ్టీ అడిట్ జరగాలని ఆదేశాలు జారీ చేసారు. నిర్మాణ పనులు జరిగే చోట హెచ్చరిక సంకేతాలు పెట్టాలని, బ్యారికెడ్ ల నిర్మాణం చేపట్టాలని ఈ సంద‌ర్భంగా కేటీఆర్ అధికారుల‌ను ఆదేశాలు జారీ చేసారు.

Hyderabad Rain Effect : ఖాళీగా రైతు బ‌జార్లు.. కుళ్లుతున్న కూర‌గాయలు

Exit mobile version