NTV Telugu Site icon

KTR: రుణమాఫీ విషయంలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా ఊరుకోం..

Jtr

Jtr

KTR: రైతులు పండించిన దొడ్డు వడ్లకు రూ. 500 బోనస్ వెంటనే చెల్లించాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈరోజు జరిగిన సమావేశంలో ప్రభుత్వం కేవలం సన్న వడ్లకే 500 రూపాయలు బోనస్ అని ప్రకటించడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలి అన్నారు. మూసీ ప్రక్షాళన కోసం రూ. లక్షా 50 వేల కోట్లు అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు రైతు భరోసాకి, దొడ్డు వడ్ల బోనస్ కు పైసలు లేవా అని ప్రశ్నించారు. లక్షలాది మంది రైతులకు పంగనామాలు పెడతామంటే ఊరుకోం.. వానాకాలం సీజన్ పూర్తి అవుతున్న రైతు భరోసా ఊసేలేదు అని కేటీఆర్ మండిపడ్డారు.

Read Also: Toilet Tax: హిమాచల్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ‘‘టాయిలెట్ ట్యాక్స్’’ గందరగోళం..

ఇక, మీ ముడుపుల మూసీ కోసం లక్షా 50 వేల కోట్ల రూపాయలు ఉంటాయి.. రైతులకు ఇచ్చేందుకు డబ్బులు లేవా? అని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఇప్పటికైనా అవినీతి ఆలోచనలు మానేసి.. రైతులకిచ్చిన హామీలపై దృష్టి పెట్టు అని సూచించారు. రైతు రుణమాఫీ విషయంలో ఏ ఒక్క రైతుకు అన్యాయం జరిగినా ఊరుకోం అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేటీఆర్ హెచ్చరించాడు. రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెలబెట్టుకునే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. అలాగే, సంపూర్ణ రైతు రుణామాఫీ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

Show comments