KTR : 27 నెలలు అయిన PRC పత్తా లేదు.. ఇంకా 5 DAలు బాకీ..

  • పీఆర్సీ ఆలస్యంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
  • 27 నెలలు గడిచినా పీఆర్సీపై స్పష్టత లేదు
  • పెండింగ్ డీఏలు, రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు
  • నిరుద్యోగ హామీలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కేటీఆర్
Ktr

Ktr

KTR : తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు సాక్షిగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, పీఆర్సీ అమలు , పెండింగ్ డీఏల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న జాప్యాన్ని ఆయన ఎండగట్టారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పీఆర్సీ వేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేటికీ ఆ దిశగా అడుగులు వేయకపోవడం ఉద్యోగ వర్గాలను వంచించడమేనని ఆయన విమర్శించారు. పీఆర్సీ గడువు ముగిసి 27 నెలలు కావస్తున్నా ఇంకా పత్తా లేదని, అలాగే 5 డీఏలు బాకీ ఉండటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు.

Donald Trump: ‘‘మాకు ఎవరి సాయం అవసరం లేదు’’.. మిత్రదేశాలపై ట్రంప్ గరంగరం..

కేవలం సర్వీసులో ఉన్న ఉద్యోగులే కాకుండా, రిటైర్డ్ ఉద్యోగుల పరిస్థితి రాష్ట్రంలో అత్యంత దయనీయంగా మారిందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ విరమణ చేసిన తర్వాత రావాల్సిన ప్రయోజనాలు (Retirement Benefits) సకాలంలో అందక, ఆర్థిక ఇబ్బందులతో ఇప్పటివరకు సుమారు 80 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారని ఆయన సభ దృష్టికి తీసుకెళ్లారు. దీనికి సంబంధించి పలు ఉదాహరణలను ప్రస్తావిస్తూ.. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేక, తమకు రావాల్సిన సొంత సొమ్ము కోసం ఎదురుచూస్తూ ప్రాణాలు వదిలిన ఘటనలు కలచివేస్తున్నాయని పేర్కొన్నారు. 60 లక్షల రూపాయల వరకు బెనిఫిట్స్ రావాల్సిన ఇన్స్పెక్టర్లు, హెడ్ మాస్టర్లు అప్పుల ఒత్తిడితో గుండెపోటుకు గురై మరణించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అని ఆయన విమర్శించారు.

Bollywood : పదేళ్లుగా బ్లాక్ బస్టర్ చూడని యంగ్ హీరో.. పిలిచి అవకాశాలిస్తున్న బడా సంస్థ

మరోవైపు నిరుద్యోగుల విషయంలోనూ ప్రభుత్వం మాట తప్పిందని కేటీఆర్ మండిపడ్డారు. గత ఏడాది జూన్ 2న ప్రారంభిస్తామన్న ‘రాజీవ్ యువ వికాసం’ పథకం ఇంతవరకు కార్యరూపం దాల్చలేదని ఎద్దేవా చేశారు. తన పార్టీ అధిష్టానానికి వెయ్యి కోట్లు ఇచ్చే సత్తా ఉందని చెప్పుకునే ముఖ్యమంత్రి, రాష్ట్రం కోసం కష్టపడి పనిచేసిన ఉద్యోగులకు , భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలను ఎందుకు చెల్లించడం లేదని ఆయన నిలదీశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉద్యోగుల పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, పీఆర్సీ ప్రక్రియను వేగవంతం చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.