NTV Telugu Site icon

Telangana Speaker: స్పీకర్ ఎన్నికకు బీఆర్ఎస్ మద్దతు.. అసెంబ్లీకి కేటీఆర్, హరీష్ రావ్

Telangana Asembly Ktr Harish Rao

Telangana Asembly Ktr Harish Rao

Telangana Speaker: స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. స్పీకర్ నామినేషన్ కి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పలువురు మంత్రులు హాజరు కానున్నారు. అయితే స్పీకర్ ఎన్నికకు బీఆర్ఎస్ మద్దతు ప్రకటించింది. బీఆర్ఎస్ తరుపున స్పీకర్ నామినేషన్ కి బీఆర్‌ఎస్‌ నేతలు కేటీఆర్‌, హరీశ్‌రావు హాజరుకానున్నారు. ఇవాళ మధ్నాహ్నం 12 గంటలకు అసెంబ్లీ కి కేటీఆర్ రానున్నారు. అయితే ఇప్పటికే అసెంబ్లీ ఎంఐఎం ఎమ్మెల్యేలు చేరుకున్నారు. కాగా.. ఇవాళ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లకు గడువు విధించారు. మధ్యాహ్నం 12:30 గంటలకు కాంగ్రెస్ తరపున గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ పదవికి నామినేషన్ వేయనున్నారు. నామినేషన్ కాపీని అసెంబ్లీ కార్యదర్శికి అందజేస్తారు.

Read also: CP Srinivas Reddy: త్వరలో సినీ పెద్దలతో సమావేశం.. డ్రగ్స్ నిర్మూలన పై చర్చ

నూతనంగా ఎన్నికైన శాసనసభ స్పీకర్ అభ్యర్థిగా మాజీ మంత్రి, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. సహజంగానే అధికార పార్టీ స్పీకర్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. గడ్డం ప్రసాద్‌ను స్పీకర్‌గా నియమిస్తే తెలంగాణ రాష్ట్ర తొలి దళిత స్పీకర్‌ అవుతారు. ప్రస్తుత శాసనసభలో అత్యధికులు అగ్రవర్ణాలకు చెందినవారే కావడం తెలిసిందే. తమను నియంత్రించే సత్తా ఉన్న స్పీకర్ పదవిని ప్రజల్లోకి తీసుకెళ్లి సభలో మాట్లాడే అవకాశం కల్పిస్తున్నారనే భావన ప్రజల్లోకి వెళ్లేందుకు కాంగ్రెస్ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
Revanth Reddy: ధరణి సమస్యలపై రేవంత్‌ రెడ్డి సమీక్ష.. కమిటీ వేసే ఆలోచనలో ప్రభుత్వం..!