Site icon NTV Telugu

KTR : ఎల్అండ్‌టి మెట్రో ప్రాజెక్టు నుంచి వెనక్కి.. సీఎం బెదిరింపులే కారణం

Ktr

Ktr

KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు నుంచి ఎల్అండ్‌టి కంపెనీ తప్పుకోవడానికి సీఎం రెవంత్ రెడ్డి వ్యవహార శైలి, బెదిరింపులే కారణమని ఆయన ఆరోపించారు. కేటీఆర్ ప్రకారం, ఎల్అండ్‌టి సంస్థపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి, ముడుపుల కోసం వేధించడంతో కంపెనీ కార్యకలాపాలను రాష్ట్రం నుంచి వెనక్కి తీసుకుంటోందని చెప్పారు. “ఒకప్పుడు ఎల్అండ్‌టి సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ను జైల్లో పెడతానని బెదిరించాడు. ఈ తరహా మాటలు, చర్యలు ప్రైవేట్ కంపెనీలను రాష్ట్రం నుంచి తరిమేస్తాయి. ప్రభుత్వానికి బాధ్యత లేకపోతే, కంపెనీలకు ఎందుకు ఉంటుంది?” అంటూ ప్రశ్నించారు.

Leica కెమెరా, 5,500mAh బ్యాటరీ, 1336 సింగిల్ కోర్ స్కోరుతో రాబోతున్న Xiaomi 15T!

కేటీఆర్ మరో కీలక వ్యాఖ్య చేస్తూ, త్వరలోనే రేవంత్ రెడ్డి వివాదాస్పద ఎమ్మార్ సంస్థ ఆస్తులను అమ్మకానికి పెట్టబోతున్నారని తెలిపారు. ఆ వ్యవహారంలో ఎంత కమిషన్ తీసుకున్నారో త్వరలోనే వెలుగులోకి వస్తుందని కేటీఆర్ ఎద్దేవా చేశారు. అంతేకాదు, గతంలో అనేక కంపెనీలపై ఉన్న కేసులను ముందుకు తెచ్చి, వాటిని సెటిల్ చేసుకుంటూ భారీగా ముడుపులు తీసుకుంటున్నారని ఆరోపించారు.

“అన్ని కంపెనీల నుంచి ముడుపులు తీసుకొని, వస్తువులను అమ్ముతూ రాష్ట్రాన్ని దోచేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఈ స్థాయిలో వ్యవహరించడం దుర్మార్గం తప్ప మరొకటి కాదు” అని కేటీఆర్ తీవ్ర స్థాయిలో దుయ్యబట్టారు. కేవలం సీఎం రేవంత్‌పైనే కాకుండా, కాంగ్రెస్ పార్టీపై కూడా కేటీఆర్ విమర్శలు గుప్పించారు. “హైదరాబాద్‌లో ఉంటే మూసీ నదిలో ఇల్లు కడుతున్నారు.. నిజమైన హైడ్రా అయితే బయటికి ఎందుకు వెళ్లడం లేదు? కాంగ్రెస్ చేయి గుర్తు తీసివేసి, బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది” అంటూ ఎద్దేవా చేశారు. అదేవిధంగా, కాంగ్రెస్‌లోని అంతర్గత వ్యవహారాలను ప్రస్తావిస్తూ, “పీసీసీ పదవి, ముఖ్యమంత్రి పదవులు డబ్బు పెట్టి కొన్నాడు. అంతేకాదు, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలను బీజేపీకి అమ్మేశాడు” అని కేటీఆర్ ఆరోపించారు.

Nacharam: ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో ర్యాగింగ్ కలకలం.. ప్రైవేట్ పార్ట్స్‌పై తన్ని..!

Exit mobile version