NTV Telugu Site icon

KP Vivekanand: ఆధారాలు లేకున్నా హరీష్ రావుపై కేసు నమోదు చేస్తారా?

Kp Vivekanand

Kp Vivekanand

KP Vivekanand: మాజీ మంత్రి హరీష్‌రావుపై తప్పుడు కేసు నమోదు చేయడంపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ స్పందించారు. చక్రదర్‌గౌడ్ అనే చీటర్ వెళ్లి కేసు పెడితే.. ఎలాంటి ఆధారాలు లేకున్నా హరీష్‌రావు లాంటి వ్యక్తిపై కేసు నమోదు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యిందని తెలిపారు. ఈ సంవత్సర కాలంలో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఆరుగ్యారెంటీలు అమలు చేస్తామన్నారు.. రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామన్నారు.. కానీ ఏడాది పూర్తయ్యినా ఇచ్చిన 420 హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయమని ప్రశ్నిస్తే.. రేవంత్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.

Read also: Ponnam Prabhakar: తెలంగాణలో మరో రెండు ఆర్టీసీ కొత్త బస్సు డిపోలు..

ఎలాంటి ఆధారాలు లేకుండా మాజీ మంత్రి హరీష్‌రావుపై కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు అవతలి వ్యక్తి ఎవరూ? వారి చరిత్ర ఏంటి? విశ్వసనీయత ఏంటీ అని పోలీసులు ఆలోచించాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే.. తప్పుడు కేసులు పెట్టడం హాస్యస్పదం అన్నారు. మేము కూడా కేసులు పెడతాం.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? అని ప్రశ్నించారు. కొడంగల్ నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి తన చావుకు సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సోదరులే కారణం అని నోట్ రాసిపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ పోలీసులు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని గుర్తుచేశారు. లగచర్లలో గిరిజనులను ఇబ్బందులకు గురిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ సోదరుడు తిరుపతి‌రెడ్డి పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదు? అని ప్రశ్నించారు.

Read also: CM Revanth Reddy: రోశయ్య వల్లే అప్పటి ముఖ్యమంత్రులు ప్రశాంతంగా పనిచేశారు..

సీఎ రేవంత్ కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులను బుల్డోజర్లు ఎక్కిస్తాం అని అంటున్న పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని మండిపడ్డారు. 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పింది సీఎం రేవంత్ రెడ్డే కదా? ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, రైతుబంధు, వృద్ధులకు, వికలాంగులు పింఛన్, మహిళలు 2500, కేసీఆర్ కిట్లు, నిరుద్యోగులకు భృతి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అవన్నీ ఎందుకు ఇవ్వడం లేదని మాజీ మంత్రి హరీష్ ప్రశ్నిస్తే.. వాటికి సమాధానం చెప్పలేక, తప్పుడు కేసులు పెడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండానే.. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే మాజీ మంత్రి హరీష్‌రావుపై కేసు నమోదు చేశారని మండిపడ్డారు.

Read also: HYDRA : హైడ్రా కీలక నిర్ణయం.. పబ్లిక్ ఆస్తుల పరిరక్షణలో కొత్త కార్యక్రమం

బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక, ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రజలకు మౌళిక సదుపాయలు కల్పించలేక కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి చతికిలపడిపోయారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతల గొంతు నొక్కాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు హరీష్‌రావుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పలేకనే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీష్‌రావుపై పెట్టిన బూటకపు కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
Weight Loss: బరువు తగ్గాలంటే జిమ్, డైట్ అవసరం లేదు.. ఈ ఆహారపు అలవాట్లు చాలండోయ్!

Show comments