KP Vivekanand: ఆధారాలు లేకున్నా హరీష్ రావుపై కేసు నమోదు చేస్తారా?
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు..
- మాజీ మంత్రి హరీష్‌రావుపై పెట్టిన బూటకపు కేసు..
- హరీష్‌రావుపై పెట్టిన కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KP Vivekanand: మాజీ మంత్రి హరీష్‌రావుపై తప్పుడు కేసు నమోదు చేయడంపై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ స్పందించారు. చక్రదర్‌గౌడ్ అనే చీటర్ వెళ్లి కేసు పెడితే.. ఎలాంటి ఆధారాలు లేకున్నా హరీష్‌రావు లాంటి వ్యక్తిపై కేసు నమోదు చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయ్యిందని తెలిపారు. ఈ సంవత్సర కాలంలో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో ఆరుగ్యారెంటీలు అమలు చేస్తామన్నారు.. రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామన్నారు.. కానీ ఏడాది పూర్తయ్యినా ఇచ్చిన 420 హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయమని ప్రశ్నిస్తే.. రేవంత్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు.
Read also: Ponnam Prabhakar: తెలంగాణలో మరో రెండు ఆర్టీసీ కొత్త బస్సు డిపోలు..
Also Read
- Jobs In Hydraa: హైడ్రాలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఆగస్టు 8, 9 తేదీల్లో నేరుగా ఎంపిక ప్రక్రియ..
- Cyber Crime: సైబర్ క్రైమ్ పనితీరులో మొదటి స్థానంలో తెలంగాణ.. 9 కీలక అంశాల్లో అగ్రగామిగా..
- Fake NOC Colleges: ఫేక్ ఫైర్ ఎన్ఓసీలతో అనుమతులు పొందిన 52 కళాశాలలు.. కాలేజీల పూర్తి లిస్ట్ ఇదే..
- Aasara pensions: ఆసరా పెన్షన్లపై బిగ్ అప్డేట్.. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి శుభవార్త.. ఆ రోజు నుంచే కొత్త పెన్షన్లు విడుదల..
ఎలాంటి ఆధారాలు లేకుండా మాజీ మంత్రి హరీష్‌రావుపై కేసులు నమోదు చేయడం సరికాదన్నారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసే ముందు అవతలి వ్యక్తి ఎవరూ? వారి చరిత్ర ఏంటి? విశ్వసనీయత ఏంటీ అని పోలీసులు ఆలోచించాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయాలని ప్రశ్నిస్తే.. తప్పుడు కేసులు పెట్టడం హాస్యస్పదం అన్నారు. మేము కూడా కేసులు పెడతాం.. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారా? అని ప్రశ్నించారు. కొడంగల్ నియోజకవర్గంలోని కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ సాయిరెడ్డి తన చావుకు సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సోదరులే కారణం అని నోట్ రాసిపెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ పోలీసులు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని గుర్తుచేశారు. లగచర్లలో గిరిజనులను ఇబ్బందులకు గురిచేసిన ముఖ్యమంత్రి రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డి పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదు? అని ప్రశ్నించారు.
Read also: CM Revanth Reddy: రోశయ్య వల్లే అప్పటి ముఖ్యమంత్రులు ప్రశాంతంగా పనిచేశారు..
సీఎ రేవంత్ కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులను బుల్డోజర్లు ఎక్కిస్తాం అని అంటున్న పోలీసులు కేసులు నమోదు చేయడం లేదని మండిపడ్డారు. 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని చెప్పింది సీఎం రేవంత్ రెడ్డే కదా? ప్రశ్నించారు. రైతు రుణమాఫీ, రైతుబంధు, వృద్ధులకు, వికలాంగులు పింఛన్, మహిళలు 2500, కేసీఆర్ కిట్లు, నిరుద్యోగులకు భృతి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అవన్నీ ఎందుకు ఇవ్వడం లేదని మాజీ మంత్రి హరీష్ ప్రశ్నిస్తే.. వాటికి సమాధానం చెప్పలేక, తప్పుడు కేసులు పెడుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండానే.. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే మాజీ మంత్రి హరీష్‌రావుపై కేసు నమోదు చేశారని మండిపడ్డారు.
Read also: HYDRA : హైడ్రా కీలక నిర్ణయం.. పబ్లిక్ ఆస్తుల పరిరక్షణలో కొత్త కార్యక్రమం
బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేక, ఇచ్చిన హామీలు అమలు చేయలేక, ప్రజలకు మౌళిక సదుపాయలు కల్పించలేక కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి చతికిలపడిపోయారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతల గొంతు నొక్కాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ఫోన్ ట్యాపింగ్‌కు హరీష్‌రావుకు ఎలాంటి సంబంధం లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. సమాధానం చెప్పలేకనే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీష్‌రావుపై పెట్టిన బూటకపు కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
Weight Loss: బరువు తగ్గాలంటే జిమ్, డైట్ అవసరం లేదు.. ఈ ఆహారపు అలవాట్లు చాలండోయ్!
తాజావార్తలు
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్‌ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!
-
Friday Horoscope: ఆ రాశి వారు జాగ్రత్త.. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు!
-
Ishan Kishan: బ్యాంక్ ఉద్యోగం, క్రికెట్ సరిపోలేదా?.. పార్ట్ టైమ్ టీ కొట్టు ఎప్పుడు పెట్టావ్ ఇషాన్ కిషాన్ భాయ్?
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్‌కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్‌లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!