https://youtu.be/RA1YcChBCpo
భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవానికి భక్తులు పోటెత్తుతున్నారు. సోమవారంతో కోటి దీపోత్సవం ముగియనుండడంతో శనివారం భక్తుల తాకిడి బాగా పెరిగింది.శంఖారావంతో ప్రారంభమైంది పదమూడవ రోజు కోటి దీపోత్సవ మహోత్సవం. శ్రీ అలిమేలుమంగ సర్వయ వేదపాఠశాల, బుద్వేల్ వారి చే వేదపఠనం జరిగింది. సంకష్టహర చతుర్థి శుభవేళ ఈ ప్రదోషకాల అభిషేకం వీక్షిస్తే మీరు తలపెట్టిన కార్యం దిగ్విజయమవుతుంది. టీటీడీ బృందం ఆలపించిన భక్తి గీతాలు అలరించాయి. కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి హారతి వీక్షణం.. అష్టైశ్వర్య ప్రదాయకం అని పండితులు పేర్కొన్నారు. కోటి దీపోత్సవంలో పదమూడవ రోజు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమాన్ నండూరి శ్రీనివాస్ గారి ప్రవచనామృతం భక్తులను అలరించింది. ఆలోచింపచేసింది. సర్వాభీష్టాలు సిద్ధింపజేసే కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామికి కోటి తమలపాకుల అర్చన చేశారు అర్చకులు. అనంతరం నేత్రపర్వంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి కల్యాణోత్సవం నిర్వహించారు. భక్తులు భారీగా రావడంతో ఎన్టీఆర్ స్టేడియం భక్తజన సంద్రంగా మారింది.