Jagtial: కోరుట్ల కౌన్సిలర్ భర్తపై కత్తులతో దాడి..! ఆ నాగరాజు ఎవరు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Korutla councillor husband attack with knives: జగిత్యాల జిల్లా కోర్టుల్లో దారుణం చోటుచేసుకుంది. అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్ భర్త దారుణ హత్యకు గురయ్యాడు. పట్టణంలోని తొమ్మిదో వార్డుకు చెందిన బీఆర్ ఎస్ పార్టీ కౌన్సిలర్ భర్త పోగుల లక్ష్మీరాజం(48)పై అందరూ చూస్తుండగా బైక్ పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో లక్ష్మీరాజం ఒంటిపై తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే.. తీవ్ర గాయం కావడంతో.. తీవ్ర రక్తస్రావం కావడంతో పరిస్థితి పూర్తిగా విషమించింది. దీంతో ఆసుపత్రిలో చేరిన కొద్దిసేపటికే మృతి చెందాడు. అయితే.. కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌరస్తాలో ఉదయం.. ఓ హోటల్లో లక్ష్మీరాజం తన సహచరులతో కలిసి టీ తాగుతున్నారు. ఈ క్రమంలో ఇద్దరు గుర్తు తెలియని దుండగులు బైక్‌పై వచ్చారు. కత్తులతో మెడపై నరికేశారు. ఈ దృశ్యాన్ని చూసిన వారంతా గట్టిగా కేకలు వేయడంతో దుండగులు అదే బైక్‌పై అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్రగాయాలతో కిందపడిన లక్ష్మీరాజంను స్థానికులు కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.
Read also: KCR Govt: ఇమామ్‌లు, మౌజంలకు గుడ్‌న్యూస్.. మరో 7 వేల మందికి గౌరవ వేతనం
Also Read
అయితే.. అప్పటికే రక్తస్రావం ఎక్కువగా ఉండడంతో పరిస్థితి పూర్తిగా చేయి దాటిపోయింది. దీంతో లక్ష్మీరాజం ఆస్పత్రిలో చేరిన కొద్దిసేపటికే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. అక్కడున్న సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి దాడికి పాల్పడిన వారి కోసం గాలిస్తున్నారు. అయితే ఘటనా స్థలాన్ని డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ ప్రవీణ్ కుమార్ కూడా పరిశీలించారు. దాడి చేసింది ఎవరు, కారణాలేంటి? ఈ ఘటనతో కోరుట్లలో భయానక వాతావరణం నెలకొంది. అయితే.. లక్ష్మీరాజం మామిడి తోటల కాంట్రాక్టర్. ఈ క్రమంలో పలు భూములకు సంబంధించి వివాదాలు కూడా ఉన్నాయి. అయితే.. పాత కక్షల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అందులోనూ.. లక్ష్మీరాజం చనిపోయే ముందు నాగరాజు అనే పేరును ఉచ్చరించినట్లు తెలుస్తోంది. ఆ నాగరాజు ఎవరు? అతను ఆ పేరును ఎంత పలికాడు? వచ్చిన వారిలో నాగరాజు అనే వ్యక్తి ఉన్నాడా? ఇప్పుడది చర్చనీయాంశంగా మారింది.
Minister KTR: నేతన్న బీమా అర్హత వయస్సు పెంపు.. ఎంతంటే..?
తాజావార్తలు
-
Bollywood : భారీ ధరకు 25 ఎకరాల భూమి కొనుగోలు చేసిన స్టార్ హీరో
-
Tollywood : టాలీవుడ్‌కు ఒక గట్టి గుణపాఠం నేర్పిన మా ఇంటి బంగారం, లెనిన్
-
Abhishek Sharma: అభిషేక్ శర్మకు ఢిల్లీ హైకోర్టులో బిగ్ రిలీఫ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Prithviraj Sukumaran: ఇతర భాషల్లో క్రేజ్… మాలీవుడ్‌లో తగ్గుతున్న పృథ్వీరాజ్ జోరు?
-
IND vs ENG 1st ODI: టీ20 పరాభవానికి ప్రతీకారం.. ఇట్స్ రివెంజ్ టైం.! నేడు తొలి వన్డే ప్లేయింగ్ XI ఇదే..
ట్రెండింగ్
-
ఓపెన్-ఇయర్ డిజైన్, AI కాలింగ్ ఫీచర్స్, 37 గంటల బ్యాటరీతో Sony LinkBuds Clip భారత్‌లో లాంచ్.!
-
IPL 2027-CSK: సీఎస్కేకు క్రికెట్ దిగ్గజం గుడ్‌బై.. 18 ఏళ్ల బంధానికి ముగింపు!
-
IND vs ENG 1st ODI: ముగ్గురు మొనగాళ్లు వచ్చేశారు.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. ఇక రచ్చరచ్చే!
-
APTRANSCO Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. APTRANSCOలో 200 AEE ఉద్యోగాలు.. రూ.2.08 లక్షల వరకు జీతం.!
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!