NTV Telugu Site icon

ఏడేళ్లలో అందరికీ ఎంతో మేలు జరిగింది… మంత్రి కొప్పుల

హుజూరాబాద్‌ ఎన్నికల్లో వేడి పెరుగుతూనే వుంది. జమ్మికుంటలో మహిళల సమావేశంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌కు ఎందుకు ఓటువేయాలో ఓటర్లకు వివరించే ప్రయత్నం చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కు, టిఆర్ఎస్ కు సంపూర్ణ మద్దతు ఉందని, ఏడేళ్లలో ఏ యే వర్గానికి ఎంత మేలు జరిగిందో మీకు తెలుసు అన్నారు.

ప్రజలెదుర్కొంటున్న తక్షణ సమస్యలను కెసిఆర్ గుర్తించి పరిష్కరించారని..తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. తెలంగాణ అంతటా స్వచ్ఛమయిన నీరు లభిస్తోందన్నారు కొప్పుల ఈశ్వర్. బోరు నీళ్లు,సుద్ధ నీళ్లు, ఫ్లోరైడ్ నీళ్లు ఎక్కడా లేవు. స్వచ్ఛమైన గోదావరి నీళ్లు, పరిశుద్ధమైన తాగు నీళ్లు అందుతున్నాయి. 46వేల చెరువుల మరమ్మత్తులు జరిగాయి.

కాళేశ్వరం ద్వారా సాగు నీరందుతోంది. సకాలంలో పుష్కలంగా కురిసిన వర్షాలతో భూగర్భ జలాలు పెరిగాయి. ఇక మహిళల సంక్షేమం గురించి చెప్పాలంటే..లక్ష మంది ఒంటరి మహిళలను గుర్తించి పింఛన్లు అందిస్తున్నం.బీడీ కార్మికులను గుర్తించి పింఛన్లు ఇస్తున్నామన్నారు. దేశంలో చాలా మంది ఉన్నరు,కానీ ఒక మన రాష్ట్రంలోనే 7లక్షల మంది బీడి కార్మికులకు పింఛన్లు ఇస్తున్నాం.

కాన్పులకు ఖర్చు లేకుండా, ఇబ్బందులు పడకుండా ప్రభుత్వాసుపత్రుల్లో జరుగుతున్నయ్. నూటికి 70 శాతం ఆపరేషన్లు చేసి కాన్పులు జరిగేవి, ఇప్పుడు కెసిఆర్ కిట్,అమ్మ ఒడి పథకాల ద్వారా ప్రభుత్వం ఆదుకుంటున్నది. ఆడబిడ్డ పుడితే 13వేలు,మగ పిల్లగాడు పుడితే 12వేలు ఇస్తున్నం. చేప పిల్లల్ని ఉచితంగా అందిస్తూ ముదిరాజులు,గంగపుత్రులకు చేతినిండా పని కల్పిస్తున్నం అన్నారు. ప్రజలకు ఇన్నిరకాల మేలు జరుగుతున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు మంత్రి. అందరికీ అన్నీ ఇచ్చేది టీఆర్‌ఎస్ అయితే.. గుంజుకునే,తీసుకునే పార్టీ బిజెపి అని దుయ్యబట్టారు.

2వేల పింఛన్లు ఒక తెలంగాణలో మాత్రమే ఇస్తున్నం. బిజెపి పాలిత రాష్ట్రాలలో ఎక్కడా కూడా ఇవ్వడం లేదు. మీరంతా మంచి మనసు ఉన్న వాళ్లు,సేవా దృక్పథంతో ముందుకు పోతున్నరు. గెల్లు శ్రీనివాస్ మంచి వాడు,ఓట్లు వేయండి,మరిన్ని వేయించండి. మంచి ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. మీకు ప్రభుత్వం నుంచి తప్పక సహాయ సహకారాలు అందుతాయని హామీ ఇచ్చారు కొప్పుల.