NTV Telugu Site icon

Kunamneni: మాట మారిస్తే సరైంది కాదు… కాంగ్రెస్ తో పొత్తు ఇవాళ, రేపు ఫైనల్ అవుతుంది

Kunam Neni Sambasivarao

Kunam Neni Sambasivarao

Kunamneni: ఇప్పుడిప్పుడు మాట మారిస్తే మాత్రం సరైంది కాదు.. కాంగ్రెస్ తో పొత్తు ఇవాళ ,రేపు ఫైనల్ అవుతుందని CPI రాష్ట్ర కార్యదర్శి కూనoనేని సాంబశివరావు అన్నారు. కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందనే నమ్మకం ఉందన్నారు. మాకు ఇష్టం ఉన్నా లేకున్నా రెండు స్థానాలకు అంగీకరించి వేచి ఉండాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. కాంగ్రెస్ అధిష్టానం కూడా మా జాతీయ నాయకత్వం తో మాట్లాడ్డం జరిగింది… కాబట్టి వేచి ఉన్నామన్నారు. కాంగ్రెస్ ప్రకటించే 19 సీట్లకు సంబంధించిన వాటిలో మా ఉమ్మడి వామపక్షాలకు 4 సీట్లను మినహాయించి ఇస్తారని విశ్వసిస్తున్నామన్నారు. మేము మునుగోడులో బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కి సపోర్ట్ చేసాము కాబట్టి అక్కడ గెలుపు సాధ్యం అయ్యిందన్నారు. అది కాంగ్రెస్ గమనంలో పెట్టుకోవాలన్నారు.

కాంగ్రెస్ కి మా పొత్తు అనేది వారి ప్రకటన తరువాత తెలుస్తామన్నారు. వారు అన్న మాటలు నిలబెట్టుకుంటారా? లేదా అనేది చూసి పార్టీ నిర్ణయం తీసుకుంటామన్నారు. మాకు చెన్నూరు, కొత్తగూడెం అన్నారు.. సీపీఎం కి మిర్యాలగూడ, వైరా అన్నారు. కాంగ్రెస్ కి స్థితప్రజ్ఞత అవసరం… పరిస్థితులను అవగాహన చేసుకోవడం అవసరం.. కాంగ్రెస్ కి సానుకూలత వచ్చింది.. దాన్ని ప్రాపర్ గా వినియోగించుకోవాలన్నారు. చెన్నూరు పై వెనక్కి వెళ్తే… నైతిక విలువలు భగం చేసినట్టుగా భావిస్తామన్నారు. ఇప్పుడిప్పుడు మాట మారిస్తే మాత్రం సరైంది కాదన్నారు. సీపీఎం కూడా ఆగారు… అనుకున్న ప్రకారం పొత్తులు ఉంటాయని ఆశాభావంతో ఉన్నామన్నారు. లేనిపక్షంలో వామపక్షాలు మా కార్యాచరణ కలిసి నిర్ణయం తీసుకుంటామన్నారు.
Parampara Restaurant: ఇక కూకట్‌పల్లిలో ‘పరంపర’ రెస్టారెంట్‌..