Site icon NTV Telugu

Komatireddy: హరీష్ రావ్ బీజేపీలో చేరడం ఖాయం.. కోమటి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Komati Reddy Venkat Reddy

Komati Reddy Venkat Reddy

Komatireddy: ఎంపీ ఎన్నికల తర్వాత హరీష్ రావు బీజేపీలో చేరతారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్.. హరీష్.. కేటీఆర్.. మాత్రమే బీఆర్ఎస్ లో మిగిలుతారన్నారు. పార్టీ నిర్ణయమే నా నిర్ణయమన్నారు. పార్టీ ఫైనల్.. ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళకి పని చేస్తా అన్నారు. నల్గొండ, భువనగిరి లో భారీ మెజార్టీ తో గెలుస్తుంది కాంగ్రెస్ అని తెలిపారు. చేరికలపై గేట్లు మేమేం ఎత్తలేదు.. దూసుకుని వస్తున్నారని తెలిపారు. కేసీఆర్ చేసిన పాపం ఆయనకే తగిలిందన్నారు. ఆయన నేర్పిన విద్యనే కదా అన్నారు. కేసీఆర్ చేసిన పాపాల మూలంగా కరువు వచ్చిందని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అంటే వర్షం.. వర్షం అంటే కాంగ్రెస్ అనేట్టు ఉండేదన్నారు.

Read also: K. Keshava Rao: సీఎం రేవంత్‌ రెడ్డి తో ముగిసిన కేకే భేటీ..

రైతుల బాధ చూస్తే ఏడుపు వస్తుంది.. దీనికి కేసీఆర్ చేసిన పాపమే కారణమన్నారు. యాదాద్రి గుట్టపైనా కేసీఆర్ బొమ్మ.. కారు బొమ్మ వేసుకున్న పాపం తగిలిందన్నారు. కేసీఆర్ ట్యాపింగ్ పాపంతో చాలా మంది పోలీసు అధికారులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అన్నారు. సీఎంఆర్ఎఫ్ కాళేశ్వరం లో దోపిడీ జరిగిందని మండిపడ్డారు. దేవుడు పేరు తో కట్టిన ప్రాజెక్టులో అవినీతి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్ చిల్లర వ్యవహారం అని మండిపడ్డారు. ప్రతీది రాజకీయం చేయడమే కేసీఆర్ పని అన్నారు. కాంగ్రెస్ అంటే కరువు అని హరీష్ బుద్ది లేని మాటలు మాట్లాడుతున్నాడన్నారు. యాదగిరిగుట్ట పోతే దేవుడే కనపడకుండా చేశారు కేసీఆర్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎక్కడిది? అని ప్రశ్నించారు.

Read also: Rajasthan : చెత్త సేకరణకు గాడిదలు.. టెండర్లు పిలిచిన మున్సిపల్ కార్పొరేషన్

నీ టికెట్ వద్దు అని కావ్య అంటుంది అంటే అర్థం చేసుకోవాలన్నారు. కేసీఆర్.. హరీష్.. కేటీఆర్.. మాత్రమే మిగిలుతారు బీఆర్ఎస్ లో అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ ఎన్నికల తర్వాత… హరీష్ బీజేపీ లో చేరతారని అన్నారు. పాత నాయకులకు అన్యాయం జరగదు.. జరిగితే మేము మాట్లాడమా అని భరోసా ఇచ్చారు. మోడీ 400 సీట్లు వస్తాయి అన్నాడు.. అభ్యర్థులను మాత్రం పక్క పార్టీ నుండి తీసుకుంటున్నారని తెలిపారు. కే.కేశవరావు అపార అనుభవం ఉన్న నాయకుడని, కాంగ్రెస్ వచ్చి మూడు నెలలే అయ్యింది.. మా మీద దాడి చేయడం కేకే లాంటి వాళ్లకు నచ్చలేదన్నారు.

Read also: TS Water Problems: ముదిరిన ఎండలు.. నీటి కోసం ట్యాంకర్లకు ఫుల్ డిమాండ్

అందుకే బయటకు వస్తున్నారని తెలిపారు. మూడు నెలలు అధికారంకి దూరం కాగానే.. జీర్ణించుకోలేక పోతున్నారు కేసీఆర్ కుటుంబ సభ్యులు అన్నారు. మే.. జూన్ లో ఆర్ఆర్ఆర్ టెండర్ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. టానిక్ వైన్ షాప్ మీదనే 6 వేల కోట్లు సంపాదించారన్నారు. కేసీఆర్ అవినీతి పై విచారణ చేయాలి అంటే 20 ఏండ్లు పడుతుందన్నారు. తలసాని చుట్టూ ఉన్నవాళ్లు లో వెయ్యి కోట్లకు తక్కువ ఎవ్వడు లేడన్నారు.
Rajasthan : చెత్త సేకరణకు గాడిదలు.. టెండర్లు పిలిచిన మున్సిపల్ కార్పొరేషన్

Exit mobile version