Site icon NTV Telugu

Komatireddy Venkat Reddy : వర్షాలకు రోడ్లు దెబ్బతిన్నాయి.. కోమటిరెడ్డి అత్యవసర నిర్ణయం

Komatireddy

Komatireddy

Komatireddy Venkat Reddy : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్లు, భవనాల (R&B) శాఖకు చెందిన రహదారులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితిపై ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెంటనే స్పందించారు. అధికారులను అప్రమత్తం చేసి, ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Kamalinee Mukherjee: టాలీవుడ్‌లో నటించకపోవడానికి కారణం ఇదే..

మంత్రి కోమటిరెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో అధికారులు నష్టానికి సంబంధించిన తాజా నివేదికను సమర్పించారు. రాష్ట్రంలోని మొత్తం 37 ఆర్ అండ్ బి డివిజన్లలో 1039 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయని గుర్తించారు. ఈ నష్టంలో 794 వర్ష ప్రభావిత ప్రాంతాలు ఉన్నట్లు తేలింది. ముఖ్యంగా 31 చోట్ల రోడ్లు పూర్తిగా తెగిపోగా, 356 ప్రాంతాల్లో రోడ్లపై నుంచి నీరు ఓవర్‌ఫ్లో అవుతోంది. దీంతో ఇప్పటివరకు 3035 చోట్ల ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడ్డాయి.

రోడ్ల మరమ్మతుల కోసం అత్యవసరంగా నిధులు అవసరమని అధికారులు అంచనా వేశారు. తాత్కాలిక పునరుద్ధరణకు రూ. 53.76 కోట్లు, శాశ్వత మరమ్మత్తులకు రూ. 1157 కోట్లు అవసరమని తెలిపారు. ఈ నేపథ్యంలో, తక్షణ చర్యల కోసం రూ. 100 కోట్ల నిధులు మంజూరు చేయాలని ముఖ్యమంత్రిని కోరనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. అధికారులు ఇప్పటికే 10 తెగిపోయిన రోడ్లను పునరుద్ధరించగా, 236 చోట్ల ట్రాఫిక్‌ను క్లియర్ చేసి సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు కృషి చేస్తున్నారు.

Kim Jong Un’s Bulletproof Train: ఇది కదిలే కమాండ్ సెంటర్.. ఉత్తర కొరియా నియంత స్పెషల్ ట్రైన్

Exit mobile version