NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy: మంత్రి జగదీశ్‌కి వెంకటరెడ్డి సవాల్.. చేయగలవా?

Venkat Reddy Jagadish

Venkat Reddy Jagadish

Komatireddy Venkat Reddy Challenges Jagadish Reddy: మంత్రి జగదీష్ రెడ్డికి భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. దమ్ముంటే భట్టి విక్రమార్కలాగా పాదయాత్ర చేయాలని ఛాలెంజ్ చేశారు. నల్లగొండ జిల్లా మల్లేపల్లి వద్ద భట్టి పాదయాత్రలో పాల్గొన్న వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌లో సీఎం కావాలంటే మొదట ఎమ్మెల్యే కావాలని, కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేతో సహా సీఎం వరకు అందరు సమానమేనని అన్నారు. కానీ బీఆర్ఎస్‌లో పరిస్థితి భిన్నంగా ఉందని, బీఆర్ఎస్ పార్టీ వైఫల్యాలను మొదటి నుండి ఎండగడుతున్న నేత భట్టి విక్రమార్క ఒక్కరేనని పేర్కొన్నారు. నాలుగు కోట్ల ప్రజల కోసం భట్టి విక్రమార్క పీపుల్ మార్చ్ పాదయాత్ర చేస్తున్నారని అన్నారు.

Tamilisai Soundararajan: గర్భిణులు “రామాయణం” చదవడం పిల్లలకు మంచిది.

నల్లగొండలో ప్రియాంక గాంధీ సభ పెట్టాలని తాను ఆమెను విజ్ఞప్తి చేశానని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు కాంగ్రెస్ హయాంలోనే వేగంగా జరిగాయని.. అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రాజెక్టు పనులను నిలిపివేసిందని ఆరోపించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాకు సాగునీరు అందించడంలో బీఆర్ఎస్ పార్టీ ఫెయిల్ అయ్యిందన్నారు. కమీషన్ల కోసమే కాలేశ్వరం ప్రాజెక్టు కట్టారని ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందిపెట్టినా, వేధించినా సహించేది లేదని హెచ్చరించారు. ప్రజల కోసం, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న భట్టి పాదయాత్రపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. భట్టి విక్రమార్క తన స్వార్థం కోసం పాదయాత్ర చేయడం లేదని స్పష్టం చేశారు.

Kunamneni Sambasiva Rao: బండి సంజయ్ నీ స్థాయి ఎంత? బీజేపీ లేకపోతే హిందూ మతానికి రక్షణ లేదా?

తెలంగాణ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని, ఇది తెలంగాణ ప్రజల బాధ్యత అని వెంకటరెడ్డి పేర్కొన్నారు. జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిల కంటే ఎక్కువ ఆస్తులు ఒక్క మంత్రి జగదీశ్ రెడ్డి సంపాదించాడని ఆరోపించారు. హత్య కేసు నిందితుల్లోనూ జగదీశ్ రెడ్డి ముద్దాయని చెప్పారు. మీ చరిత్ర విప్పుతామని ఛాలెంజ్ చేశారు. నల్లగొండ జిల్లాలో 12 సీట్లు గెలిపించాలని ప్రజల్ని కోరారు.

Show comments