Komatireddy Venkat Reddy : తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం మరోసారి తారాస్థాయికి చేరింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తే, గత పదేళ్ల కాలంలో ఆయన చేసిన అప్పులు, అక్రమాలపై లెక్కలు తేలుస్తామని మంత్రి సవాల్ విసిరారు. ముఖ్యమంత్రికి ఎంత బాధ్యత ఉంటుందో, ప్రతిపక్ష నేతకు కూడా ప్రజా సమస్యల పట్ల అంతే బాధ్యత ఉంటుందని ఆయన గుర్తు చేశారు.
24 నెలల అజ్ఞాతం ఎందుకు?: గత 24 నెలలుగా కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా తప్పించుకుంటున్నారని కోమటిరెడ్డి విమర్శించారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉండి సభకు హాజరుకాకపోవడం బాధ్యతారాహిత్యమని మండిపడ్డారు. తమ ప్రభుత్వం చేసే పనులకు లెక్కలు అడిగే హక్కు కేసీఆర్‌కు లేదని, ముందుగా ఆయన హయాంలో చేసిన వేల కోట్ల అప్పుల లెక్కలు ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. “నీ ఆస్తుల లెక్కలు చెప్పు.. ప్రజల సొమ్ముతో ఎంత సంపాదించావో అందరికీ తెలుసు” అంటూ మంత్రి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Harman “Golden Ear” ఆడియోతో 35 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ తో Xiaomi Buds 6 లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా..!
ప్రజలు సున్నా ఇచ్చారు: పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి ‘బిగ్ జీరో’ (సున్నా) ఇచ్చి బుద్ధి చెప్పారని, అయినా కేసీఆర్ తీరులో మార్పు రాలేదని కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. గతంలో తమకు హోదా లేకపోయినా భట్టి విక్రమార్క వంటి నేతలు అసెంబ్లీలో ప్రజా సమస్యలపై పోరాడారని, ప్రస్తుతం పార్లమెంట్‌లో మల్లికార్జున ఖర్గే గారు గట్టిగా నిలదీస్తున్నారని, మరి కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.
అసెంబ్లీలో తేల్చుకుందాం: రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ ఖచ్చితంగా రావాలని మంత్రి కోమటిరెడ్డి సవాల్ విసిరారు. సభకు వస్తే పదేళ్లలో జరిగిన అవినీతి, అప్పులు , ఇతర అభివృద్ధి పనులపై తాము సిద్ధం చేసిన లెక్కలను కేసీఆర్ ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. కేసీఆర్ కేవలం ఫాంహౌస్‌కే పరిమితం కాకుండా, ప్రతిపక్ష నేతగా తన బాధ్యతను నెరవేర్చాలని హితవు పలికారు.
Droupadi Murmu: చరిత్ర సృష్టించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
