Site icon NTV Telugu

Komatireddy Venkat Reddy : నాది ఒకటే మాట.. ఒకటే బాట

Bhuvanagiri MP Komatireddy Venkat Reddy Fire on BJP and TRS.

బీజేపీ, టీఆర్‌ఎస్‌లపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను చనిపోయునప్పుడు మూడు రంగుల జెండాను కప్పమని చెప్పానని, కోమటిరెడ్డిది ఒకటే మాట….ఒకటే బాట అని ఆయన అన్నారు. ప్రధాని మంత్రి మోడీకి కేసిఆర్ అవినీతిపై పూర్తి వివరాలతో ఫిర్యాదు చేశానన్నారు. సోషల్ మీడియాలో నాపై అబద్దఫు ప్రచారాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సోషల్ మీడియాలో నా చిత్తశుద్ధిని శంకించేలా, వ్యక్తిత్వ ఖననానికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు.

అభివృద్ధి కోసం నేను పోరాడతానని, బొగ్గు గనుల కుంభకోణంపై కేసిఆర్ సమాధానం ఇవ్వాలని ఆయన వ్యాఖ్యానించారు. టీఆర్‌ఎస్‌, బీజేపీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలో రావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్‌లో ఎలాంటి సమస్యలు లేవని అందరం కలసికట్టుగానే ఉన్నామని, అధిష్టానం నిర్ణయాలతోనే ముందుకు సాగుతామన్నారు.

https://ntvtelugu.com/trs-bjp-congress-party-leaders-at-delhi/
Exit mobile version