Site icon NTV Telugu

Komatireddy: సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే పనిలో టీఆర్ఎస్‌.. సమాధానం చెప్పలేకే ఎదురుదాడి..

సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే పనిలో టీఆర్ఎస్‌ పార్టీ పడిపోయిందని విమర్శలు గుప్పించారు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.. అసెంబ్లీలో టీఆర్ఎస్‌ సభ్యులు, కోమటిరెడ్డి మధ్య మాటల యుద్ధమే నడిచింది.. ఆ తర్వాత మీడియా పాయింట్‌కు వచ్చిన రాజగోపాల్ రెడ్డి.. ప్రభుత్వం.. ఇప్పుడు మంత్రులుగా ఉన్నవారిని టార్గెట్‌ చేశారు.. నన్ను కాంట్రాక్టర్ అని పిలిచినా మంత్రి తెలంగాణ ఉద్యమంలో అయన పాత్ర ఏంటి..? ఇప్పుడు ఆయన స్థానం ఎక్కడ ఉంది..? అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమంలో అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి నన్ను వ్యాపారంలో దెబ్బతీశారు.. తలసాని కూడా ఎన్నో వ్యాపారాలు చేసేవచ్చారు.. నేను కూడా అలాగే అనాలా ? అని నిలదీశారు. రాజకీయంగా సమాధానం చెప్పలేకే.. మాపై ఎదురుదాడికి దిగారని మండిపడ్డారు..

Read Also: Telangana: మారనున్న ఇంటర్‌ పరీక్షల తేదీలు

తెలంగాణ గురించే మాట్లాడని వాళ్లు, మమ్మల్ని సభలో మాట్లాడకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన కోమటిరెడ్డి.. తెలంగాణ గురించే మాట్లాడని అయన.. ఇప్పుడు ఆ హోదాలోకి ఎలా వచ్చాడు..!? అని ప్రశ్నించారు.. తెలంగాణ ప్రజలు ఆలోచన చేయండి.. అవినీతి పాలన.. కుటుంబ పాలనకు స్వస్తి పలకాలి.. గవర్నర్ ప్రసంగం లేకుండా ఎప్పుడైనా సభ జరిగిందా .? అని మండిపడ్డారు.. ఇక, సింగరేణిని ప్రైవేట్ పరం చేస్తాం అని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదన్నారు కోమటిరెడ్డి.. కేంద్రం సింగరేణిని తీసుకోదని స్పష్టం చేసిన ఆయన.. కానీ, టీఆర్ఎస్‌ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టే పనిలో పడిపోయిందని ఆరోపించారు..ఇక, బంగారు తెలంగాణ అని అప్పుల తెలంగాణ చేయలేదా..!? పేర్లు మార్చి ప్రాజెక్టులకు లక్ష కోట్లు అదనంగా వెచ్చించి కాంట్రాక్టర్ల జేబులు నింపలేదా? అని ప్రశ్నల వర్షం కురపించారు. అసెంబ్లీలో గొంతు లేకుండా చేశాం… అయినా మాట్లాడుతున్నారు అని నాపై దాడి చేస్తున్నారని ఫైర్‌ అయిన ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి.. నా కంటే పెద్ద పదవిలో ఉన్న వాళ్లు చేస్తున్న పనులు ఎంటి..? కాంట్రాక్టు చేయడం తప్పా… దొంగతనమా..? డబ్బుల కోసం అయితే అప్పట్లో కిరణ్ కుమార్ రెడ్డి తో… ఇప్పుడు కేసీఆర్‌ దగ్గరికి వెళ్లి పనులు చేసుకునే వాళ్లం కదా? అన్నారు. తెలంగాణ కోసం త్యాగం చేసిన కుటుంబం కోమటిరెడ్డి బ్రదర్స్ అని స్పష్టం చేశారు. పైసా లేని వాళ్లు.. ఇప్పుడు కోట్లకు పడగ లేత్తారని ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి.

Exit mobile version