NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy: కేటీఆర్‍‌కు కోమటిరెడ్డి సవాల్.. నిరూపిస్తే రాజీనామా చేస్తా..

Komati Reddy Venkat Reddy

Komati Reddy Venkat Reddy

Komatireddy Venkat Reddy: తెలంగాణలో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తాజాగా ఉచిత విద్యుత్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో పెను దుమారాన్ని రేపుతున్నాయి. దీంతో బీఆర్‌ఎస్ నేతలు, మంత్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి నిరసనలకు పిలుపునిచ్చారు. వారి విమర్శలను అంతే ధీటుగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు.

Read also: Fast Eating: ఫాస్ట్ గా తింటున్నారా? మీ ప్రాణాలు గోవిందా..

తాజాగా ఎంపీ కోమటిరెడ్డి ఐటీ మంత్రి కేటీఆర్‌కు సవాల్ విసిరారు. 24 గంటల పాటు నాణ్యమైన కరెంటు ఇస్తున్నామని నిరూపిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బండ సోమారం గ్రామంలో సబ్ స్టేషన్ కు వెళ్లాను. అక్కడి లాగ్ బుక్ లో రైతులకు అందుతున్న ఉచిత కరెంట్ వివరాలను పరిశీలించారు. 10, 11 గంటలకు మించి రైతులకు కరెంట్ అందడం లేదు. అంటే, కేటీఆర్ చెప్పేవి అబద్ధాలేగా!!అన్నారు. విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఉద్యోగులకు ఇంకా జీతాలు రాలేదని గుర్తు చేశారు. సబ్ స్టేషన్ లో పని చేస్తున్న బాల నర్సయ్యను జీతం రాకుండా ఎలా బతుకుతున్నారని అడిగితే.. అప్పులు చేస్తున్నామని అన్నారని అన్నారు. కేసీఆర్ , కేటీఆర్ ఒకసారి బాల నర్సయ్య బాధలు వినాలని కోరారు. తెలంగాణ కాంగ్రెస్ కు పెరిగిన ప్రజాదరణ చూసి ఓర్వలేక, ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ డ్రామాలు చేస్తోందని మండపడ్డారు. దేశంలో ఉచిత కరెంట్ తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు.

థాక్రే ఢిల్లీలో మాట్లాడుతూ.. మేనిఫెస్టోలో 24 గంటల ఉచిత కరెంట్ హామీని పెడతామని స్పష్టంగా చెప్పారు. ఇకనైనా బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్లు నాటకాలు ఆపాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉండే రెండు నెలలు సక్రమంగా పాలన సాగించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో లక్షల మంది ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. ఇచ్చే 10 గంటల కరెంట్ 10 సార్లు పోతోందని మండిపడ్డారు. దానికే 24 గంటల కరెంట్ అని చెప్తారా? అని ప్రశ్నించారు. త్రీ ఫేజ్, సింగిల్ ఫేజ్ కు సంబంధించిన వివరాలు లాగ్ బుక్ లో ఉన్నాయి. కేటీఆర్ ఏం సమాధానం చెప్తారు? అని ప్రశ్నించారు. అమెరికా పర్యటనలో ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ ఈ రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారని కోమటిరెడ్డి వెల్లడించారు. రేపు పీసీసీని కలిసి తమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. రాజకీయ లబ్ది కోసం బీఆర్‌ఎస్ ఈ విషయాన్ని ప్రచారం చేస్తోందని వెంకట్ రెడ్డి మండిపడ్డారు.
AP v/s TS: మమల్ని రెచ్చగొట్టద్దూ.. బొత్స వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు సీరియస్..