Komaram Bheem: కొమురంభీం జిల్లాలో దారుణం.. పులి దాడిలో మహిళ మృతి
- కొమురం భీం జిల్లాలో మహిళపై పులి దాడి..
- గన్నారంకు చెందిన మోరే లక్ష్మి మృతి..
- మృతదేహంతో కాగజ్‌నగర్ ఫారెస్ట్ ఆఫీసు ముందు కుటుంబసభ్యుల ధర్నా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Komaram Bheem: కొమురంభీం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కాగజ్ నగర్ మండలం గన్నారంలో గత కొన్ని రోజులుగా పశువులపై దాడి చేస్తున్న పెద్దపులి ఈరోజు ఉదయం ఓ మహిళపై దాడి చేసింది. వ్యవసాయ పనులకు వెలుతున్న మహిళ పై పులి ఒక్కసారిగా దాడి చేసింది. మహిళ గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు పరుగున వచ్చారు. స్థానికులు చూసిన పులి అక్కడి నుంచి పారిపోయింది. పులి దాడిలో తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందింది.
మృతురాలు కాగజ్‌నగర్ మండలం గన్నారం చెందిన మార్లే లక్ష్మీగా గుర్తించారు. మృతదేహంతో కాగజ్‌నగర్ ఫారెస్ట్ ఆఫీసు ముందు కుటుంబసభ్యుల ధర్నా చేపట్టారు. తమకు న్యాయం చేయాలని ఆందోళన చేపట్టారు. పులి సంచారంతో కాగజ్ నగర్ పరిసర ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. మహారాష్ట్ర నుంచి పులుల రాక పెరిగింది. పులులు జనావాలసాలకు దగ్గరగా సంచరిస్తున్నాయని తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అధికారులు పులిని వెంటనే పట్టుకోవాలని కోరుతున్నారు.
Also Read
- Komaram Bheem District : ఆసిఫాబాద్‌లో వరద బీభత్సం.. బైకిస్టులకు తృటిలో తప్పిన ప్రమాదం..
- Human Trafficking: మానవ అక్రమ రవాణా బండారం బట్టబయలు.. ఒక్కో మహిళకు రూ. 2.5 లక్షల చొప్పున అమ్మకాలు..!
- Mother Love: పేగు బంధం అంటే ఇదే కాబోలు.. తన దూడ చనిపోయిన చోటుకు అధికారులను తీసుకెళ్లిన ఆవు..
- Tiger Tension : పులి పంజా.. తిర్యాని మండలంలో దాడి..!
Read also: Beerla Ilaiah: ఆలేరు ఆసుపత్రిలో డేట్ ముగిసిన ఇంజక్షన్.. వైద్యుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే ఆగ్రహం..
మరోవైపు నిర్మల్ జిల్లా ఖానాపూర్ ప్రాంతంలో పెద్దపులి సంచారం స్థానికంగా కలకలం రేపుతోంది. పులి దాడి చేసే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు అటవీశాఖ అధికారులు. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. కాగా.. పులి రోడ్డు దాటుతూ కనిపించడంతో వాహనదారులు తమ సెల్ ఫోన్లతో పులిని ఫొటోలు తీశారు. ఈ క్రమంలో అటవీశాఖ అధికారులు దిమ్మదుర్తి సుర్జాపూర్, మస్కాపూర్, ఎక్బాల్‌పూర్ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు.
పెద్దపులి సంచారం నేపథ్యంలో అడవిలో ఏర్పాటు చేసిన కెమెరాల్లో పులి సంచరిస్తున్న దృశ్యాలను రికార్డు అయ్యాయి. దీంతో ఖానాపూర్ సరిహద్దు అటవీ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. ఎవరూ ఒంటరిగా అడవిలోకి వెళ్లవద్దని, సాయంత్రం త్వరగా ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. అటవీశాఖ అధికారుల హెచ్చరికతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
CWC Meeting: నేడు సీడబ్ల్యూసీ సమావేశం.. హాజరుకానున్న తెలుగు రాష్ట్రాల నేతలు..
తాజావార్తలు
-
Houthi War: సౌదీకి పాకిస్తాన్ దూరం.. అండగా నిలుస్తున్న ఫ్రాన్స్!
-
Minister Seethakka : సీతక్క కీలక ప్రకటన.. అక్టోబర్ 25 నుంచి తెలంగాణలో ‘హ్యామ్’ రోడ్లు
-
World Cup 2027: వన్డే వరల్డ్ కప్ 2027పై గంభీర్ మాస్టర్ ప్లాన్.. హార్దిక్, బుమ్రా కష్టమే..!
-
Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
-
CM Revanth Reddy : హైదరాబాద్‌లో మన్మోహన్ సింగ్‌కు ఘన నివాళి.. రేపు విగ్రహావిష్కరణ.!
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!