NTV Telugu Site icon

Asifabad: కొమురం భీం జిల్లాలో హడలెత్తిస్తున్న పులి.. 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు

Asifabad Tiger

Asifabad Tiger

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాను పులి వణికిస్తుంది. సిర్పూర్ టి మండలం ఇటిక్యాల పహాడ్ శివారులో పులి సంచారం కలకలం రేపుతోంది. నిన్న లేగ దూడను చంపి ఎద్దుపై దాడి చేసింది.. పులి దాడిలో ఎద్దుకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో.. కెనాల్ ఏరియాలో పులి పాద ముద్రలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. పులి మానిటరింగ్ కోసం 10 ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. మహారాష్ట్రకు రెండు కిలో మీటర్లు దూరంలో పులి ఉన్నట్లు గుర్తించారు. కాగా.. రెండు రోజుల వ్యవధిలో మూడు పశువులు, ఇద్దరు మనుషుల పై దాడికి పాల్పడింది.

Read Also: Egg Price Hike: కూరగాయలు మాత్రమే కాదు.. కోడిగుడ్డు రేటూ పెరుగుతోంది! చుక్కలు చూస్తున్న సామాన్యులు

పులి దాడిలో మొన్న ఓ మహిళ మృతి చెందింది. నిన్న సురేష్ అనే రైతుపై దాడి చేసింది. చేనులో పని చేస్తున్న క్రమంలో దాడికి పాల్పడింది. ప్రస్తుతం మంచిర్యాల ఆసుపత్రిలో రైతు చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్యం నిలకడగానే ఉంది. పులి వరుస దాడులతో పల్లెలు దద్దరిల్లుతున్నాయి. పులి సంచారంతో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. అయితే.. పులి సంచరిస్తున్న నేపథ్యంలో అటవీశాఖ అధికారులు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే 15 గ్రామాల్లో 144 సెక్షన్ విధించారు. గత నాలుగేళ్లలో ఇక్కడ పులుల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని అటవీశాఖ అధికారులు తెలుపుతున్నారు. అందుకే ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎప్పటికప్పుడు సూచిస్తున్నారు.

Read Also: Encounter: ములుగు జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్.. ఏడుగురు మావోయిస్టులు హతం